Advertisement
Google Ads BL

సాక్ష్యం తెలిసింది.. వెడ్డింగ్ సంగతేంటో..?


సాక్ష్యం సినిమా విడుదల తేదీ అన్నప్పటి నుండి అనేకరకాల సమస్యలను ఎదుర్కొంది. సాక్ష్యం సినిమా సెన్సార్ విషయంలోనే కాస్త ఇబ్బంది పడినా మూవీ టీమ్.. సినిమా విడుదల రోజున మరింత టెంక్షన్ పడింది. నిన్న శుక్రవారం ఉదయం ఆటతోనే ప్రేక్షకుల ముందు రావాల్సిన సాక్ష్యం సినిమా కొన్ని ఫైనాన్స్ కారణాల వలన ఉదయం షోస్ క్యాన్సిల్ అవగా.. మధ్యాహ్నం ఆటకు మాత్రం థియేటర్స్ లో ప్రింట్ పడింది. అయితే సినిమా లేట్ గా స్టార్ట్ అయినప్పటికీ.. సాక్ష్యం సినిమాకి మిక్స్డ్ టాక్ పడింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా మరీ గొప్పగా నటించకపోయినా .. సిక్స్ ప్యాక్ తో అదరగొట్టాడు. ఇక డైలాగ్ డెలివరీ వీక్ అయినా.. యాక్షన్ సీన్స్ లో మెప్పించాడు. అలాగే హీరోయిన్ పూజ హెగ్డే గ్లామర్ కూడా ఈ సినిమా కి హెల్ప్ అయ్యిందనే చెప్పాలి. పూజ అందాల విందు ట్రెడిషనల్ గా కూడా బావుంది. ఇక సాక్ష్యం సినిమాకి మెయిన్ హైలెట్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ తోపాటుగా నిర్మాతలు భారీగా పెట్టిన పెట్టుబడి కూడా ప్లస్ పాయింట్స్. ఇక ఈ సినిమాలో కామెడీ మైనస్ కాగా.. డైరెక్షన్ కూడా కాస్త వీక్ గా అనిపిస్తుంది. శ్రీవాస్ అనుకున్న కథను స్క్రీన్ మీద ప్రెజెంట్ చెయ్యడంలో తడబడ్డాడు. పంచభూతాలు అనే డిఫ్రెంట్ కాన్సెప్ట్ తీసుకుని... స్క్రీన్ ప్లే వీక్ చేసేసాడు. అలాగే పాటల ప్లేసెమెంట్స్ కూడా అంతగా రుచించలేదు. ఏమైనా బెల్లంకొండ శ్రీనివాస్ ఓకే రేటింగ్ తో ఓకే అనిపించుకున్నాడు.

Advertisement
CJ Advs

ఇక ఈ వారం మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిన్న శుక్రవారం సాక్ష్యం సినిమా విడుదల కాగా.. ఈ రోజు శనివారం మెగా డాటర్ నిహారిక కొణిదెల... ఎం ఎస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ ల హ్యాపీ వెడ్డింగ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. క్లిన్ యు తో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించే విధముగానూ.. నిహారిక ట్రెడిషనల్ లుక్స్ అన్ని ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా కనబడుతున్నాయి. మరి నిన్న విడుదలైన సాక్ష్యం సినిమాకి మిక్స్డ్ టాక్ రాగా.. భారీ ప్రమోషన్స్ తో ముందంజలో ఉన్న ఈ హ్యాపీ వెడ్డింగ్ కి ఏ టాక్ వస్తుందో మరికొద్ది గంటల్లోనే తెలిసిపోతుంది.

What About Happy Wedding Movie?:

Saakshyam vs Happy Wedding
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs