Advertisement
Google Ads BL

డైరెక్టర్.. ఆమెకి ఆల్ ద బెస్ట్ ఎందుకు చెప్పాడు?


బాలీవుడ్ భామ ప్రియాంక పెళ్లి వార్తలు రోజు రోజుకి సోషల్ మీడియాలో ఎక్కువై పోతున్నాయి. హాలీవుడ్ హాలీవుడ్ అంటూ తిరుగుతున్న ప్రియాంక చోప్రా హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ని పేమిస్తుందనే న్యూస్ ఎప్పటినుండో వినబడుతుంది. ఈమధ్య కాలంలో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా సమాచారం. ఇక హాలీవుడ్ మీద మోజుతో బాలీవుడ్ సినిమాలను వదిలేసి ముంబై నుండి అమెరికాకి ఎగిరిపోయిన ప్రియాంక.. సల్మాన్ ఖాన్ సినిమాలో హీరయిన్ గా ఒప్పుకుంది. సల్మాన్ ఖాన్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న భరత్ అనే సినిమా మాలో ప్రియాంక చోప్రా హీరోయిన్. ఈ సినిమాకి గాను ప్రియాంక పెద్దమొత్తంలో పారితోషకం కూడా అందుకుందనే ప్రచారం జరిగింది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా ప్రియాంక చోప్రా సల్మాన్ ఖాన్ భరత్ సినిమా నుండి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రియాంక చోప్రా సడన్ గా ఈ భారీ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడానికి కారణాలు రెండే రెండు కారణాలు కనబడుతున్నాయి. అవేమిటంటే భరత్ మూవీ డైరెక్టర్  అలీ అబ్బాస్ ట్వీట్ చేసినట్లుగా ఆల్ ద బెస్ట్ ప్రియాంక.. అనే ట్వీట్ చూస్తుంటే రెండు కారణాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఆల్ ద బెస్ట్ ప్రియాంక.. అని డైరెక్టర్ అలీ అబ్బాస్ ఎందుకు చెబుతాడు.. ఏమన్నా ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకుంటుంటే.. లేదంటే భరత్ కన్నా మంచి ఆఫర్ తగిలితే. మరి నిజంగానే ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకోబోతుందా?

లేదంటే హాలీవుడ్ మీద ఇష్టంతో అక్కడ వచ్చిన బడా ఆఫర్ కోసమే భరత్ కి హ్యాండ్ ఇచ్చిందా. దేనికి  డైరెక్టర్ అలీ అబ్బాస్.. ప్రియాంకకి ఆల్ ద బెస్ట్ చెప్పాడు. ఏమో ఈ రెండు కారణాల్లో ఏదైనా ఉండొచ్చు గాని.. భరత్ నుండి ప్రియాంక  తప్పుకుందనే విషయాన్ని  డైరెక్టర్ అలీ అబ్బాస్ కన్ఫర్మ్ అయితే చేశాడు.

Priyanka Chopra walks out of Salman Khan's Bharat?:

Priyanka Chopra opts out of Bharat. Is wedding on the cards?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs