Advertisement
Google Ads BL

‘గూఢచారి’ ట్రైలర్ అదరిపోయింది: నాని!


'క్షణం' వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గూఢచారి’. శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీం మర్చెంట్స్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అభిషేక్ నామ, టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా గూఢచారి చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం టీజర్ని ఇటీవల సమంత రిలీజ్ చేశారు. ఈ టీజర్ కి సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. ఒక్క  టీజర్ తోనే ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. టేకింగ్, మేకింగ్ పరంగా  హాలీవుడ్ చిత్రాలకి ధీటుగా హైటెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సుప్రియ, రవిప్రకాష్,  ముఖ్యపాత్రల్లో నటించారు. బిజినెస్ పరంగా ఈ చిత్రానికి అన్ని ఏరియాల నుండి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర అత్యధిక ధర వెచ్చించి కొనుగోలు చేశారు.  ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ ద్వారా ఆగష్టు 3న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని  రిలీజ్ చేస్తున్నారు. కాగా గూఢచారి థియేట్రికల్ ట్రైలర్ ని నాచురల్ స్టార్ నాని జూలై 27న అన్నపూర్ణ స్టూడియో ప్రివ్యూ  థియేటర్ లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో అడివి శేషు, హీరోయిన్ శోభిత, దర్శకుడు శశికిరణ్, మాటల రచయిత అబ్బూరి రవి, కెమెరామెన్ షానియేల్, నిర్మాతలు టి జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, ఏకే ఎంటర్ టైన్మెంట్స్  అధినేత అనీల్ సుంకర పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

అనంతరం గూడాచారి థియేటర్ ట్రైలర్ నాని రిలీజ్ చేశారు. నాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ... లాస్ట్ టైం నేను అర్జున్ రెడ్డి థియేటర్ ట్రైలర్ ని లాంచ్ చేశాను. అది సూపర్ సక్సెస్ అయింది. శేషు టెర్రిఫిక్ పెర్ఫార్మర్. క్షణంతో పాటు కొన్ని సినిమాలు చూశాను. ఎందుకో తనకి రావాల్సిన గుర్తింపు రాలేదని నేను బాగా ఫీల్ అయ్యేవాడ్ని. ఆలోటు ఈ సినిమాతో తీరుతుంది. ఏది శేషుకి కరెక్ట్ సినిమా. రైట్ టైంలో వస్తుంది. అతను  చాలా పాజిటివ్ పర్సన్. ఏ సినిమా గురించి అయినా సోషల్ మీడియాలో పాజిటివ్ గా మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి శేషు సినిమాకి నా సపోర్ట్ ఉండాలని ఈ ఫంక్షన్ కి వచ్చాను. గూఢచారి ట్రైలర్ చూడగానే గూజ్‌ బమ్స్ వచ్చాయి. అదిరిపోయింది. ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, రీ రికార్డింగ్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, అన్నీ ఎక్సట్రార్డినరీగా వున్నాయి. ఏ బాషా చిత్రం అయినా మనం చూసినప్పడు బడ్జెట్ ఎంత అయింది ఎంతలో తీశారు అని మాట్లాడుకుంటాం. కానీ సినిమాకి కావాల్సింది బడ్జెట్ కాదు, క్లారిటీ. నాకు ఈ సినిమా టీజర్, ట్రైలర్ పిచ్చి పిచ్చిగా నచ్చాయి. ట్రైలర్ ఈ రేంజిలో ఉంటే రేపు సినిమా ఇంకెంత రేంజ్ లో ఉంటుందో. ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంటుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి బ్లాక్ బస్టర్ చెయ్యాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో అడివి శేషు మాట్లాడుతూ... ఈ సినిమా టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏది ఎలాంటి సినిమా అని అందరికి డౌట్ ఉండేది. ఇప్పుడు ట్రైలర్ లో మా సినిమా కంటెంట్ ఏంటి అనేది చూపిస్తున్నాం. చాలా నెర్వస్ గా వుంది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి మా టీమ్ ముఖ్య కారణం. డైరెక్టర్ శశి, కెమెరామెన్ షానియేల్, ప్రతి ఒక్కరూ డే అండ్ నైట్ కష్టపడి వర్క్ చేశారు. ఒక సాధారణ కాలేజ్ స్టూడెంట్ గూఢచారిగా మారితే ఎలా ఉంటుంది అనేది మా చిత్రం కాన్సెప్ట్. జెన్యూన్ గా ఈ ఫిలిం తీశాం. మా అందరికీ ఈ సినిమా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. ట్రైలర్ ని లాంచ్ చేసిన నానికి నా స్పెషల్ థాంక్స్ అన్నారు. 

ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అధినేత  సుంకర మాట్లాడుతూ... టీమ్ అందరు ఒక కమిట్ మెంట్ తో వర్క్ చేశారు.ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరూ ఇన్స్పైర్ అవుతారు . ఇలాంటి ఒక మంచి చిత్రాన్ని మా బ్యానర్ ద్వారా రిలీజ్ చేయడం చాలా  ప్రౌడ్ గా ఫీలవుతున్నాను అన్నారు. 

Nani Launches Goodachari Movie Trailer:

Adivi Sesh's Goodachari Trailer Released by Nani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs