Advertisement
Google Ads BL

'పేపర్ బాయ్' కి అద్భుతమైన స్పందన!


సంపత్ నంది నిర్మాతగా సంతోష్ శోభన్, రియా సుమన్ మరియు తాన్య హోప్ ప్రధానపాత్రల్లో వస్తున్న చిత్రం 'పేపర్ బాయ్'. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ 2.5 మిలియన్ డిజిటల్ వ్యూస్ తో యు ట్యూబ్ లో రికార్డు  సృష్టించగా  ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకుంది.. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ త్వరలో సినిమాకి సంబంధించిన థియరిటికల్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు.. అలాగే సినిమాలోని మొదటి పాటను జూలై 28 న సాయంత్రం 3 గంటలకు రిలీజ్ చేస్తామని చెప్పారు. 'పేపర్ బాయ్' గా పనిచేస్తూ ఓ అమ్మాయిని లవ్ చేసే ఇంజనీరింగ్ చదివే కుర్రాడి చుట్టూ తిరిగే ఈ  సినిమాకి జయ శంకర్ దర్శకత్వం వహించగా బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సంగీతం, సౌందర్య రాజన్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తించారు.. 

Advertisement
CJ Advs

తారాగణం :సంతోష్ శోభన్, రియా సుమన్, తాన్య హోప్, పోసాని కృష్ణ మురళి, అభిషేక్ మహర్షి, విద్యు రామన్ , జయప్రకాష్ రెడ్డి, బిత్తిరి సత్తి, సన్నీ, మహేష్ విత్తా మరియు ఇతరులు

సాంకేతిక నిపుణులు : దర్శకుడు: జయశంకర్, నిర్మాతలు: సంపత్ నంది, రాములు, వెంకట్ మరియు నరసింహ, బ్యానర్లు: సంపత్ నంది టీం వర్క్స్, BLN సినిమా మరియు ప్రాచిత్ర క్రియేషన్స్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో,  సినిమాటోగ్రఫీ: సౌందర్య రాజన్‌,  ఎడిటర్: తమ్మి రాజు, ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీ మామిళ్ల,  స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్ : సుధాకర్ పావులూరి, PRO: వంశీ శేఖర్

‘Paper Boy’ Teaser gets a superb response:

The teaser of ‘Paper Boy’ has garnered an amazing response and so far it has got over 2.5 Million digital views. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs