Advertisement
Google Ads BL

విజయ్‌ కోసమా? బన్నీవాసు కోసమా?


'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' తర్వాత బొత్తిగా స్టైలిష్‌స్టార్‌ ప్రేక్షకులకు కనిపించి చాలా కాలమే అయ్యింది. చిత్రానికి చిత్రానికి పెద్దగా గ్యాప్‌ తీసుకునే అలవాటు లేని బన్నీ ఈ సారి మాత్రం కాస్త వ్యవధి తీసుకుంటున్నాడు. ఈయన తదుపరి చిత్రం ఏమిటో కూడా క్లూ రావడం లేదు. ఇక తాజాగా ఆయన తన భార్య, పిల్లల ఫొటోలను తానే తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇక అల్లు ఫ్యామిలీకి చెందిన బన్నీ వాసు నిర్మాతగా ప్రస్తుతం అర్జున్‌రెడ్డి విజయ్‌దేవరకొండ హీరోగా, కన్నడ సంచలనం రష్మిక మండన్న హీరోయిన్‌గా పరుశురాం దర్శకత్వంలో 'గీత గోవిందం' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. గతంలో అల్లు శిరీష్‌ హీరోగా అల్లుఅరవింద్‌ గీతాఆర్ట్స్‌ బేనర్‌లోనే పరుశురాం 'శ్రీరస్తు.. శుభమస్తు' వంటి హిట్‌ని అందించాడు. 

Advertisement
CJ Advs

ఇక అర్జున్‌రెడ్డి తర్వాత 'మహానటి'లో చిన్న పాత్రను చేసినా కూడా చాలా గ్యాప్‌ తీసుకుని విజయ్‌ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన వినూత్నమైన పోస్టర్స్‌ని పోస్ట్‌ చేస్తూ విజయ్‌ దేవరకొండ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని ప్రమోట్‌ చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం ఆడియో వేడుక తేదీని ఖరారు చేస్తూ విజయ్‌ ఆడియో క్యాసెట్‌పై లుంగీతో కూర్చుని ఉండగా, వెనుక రష్మిక మండన్న క్యాసెట్‌పై కాలు మోపిన పోస్టర్‌ బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రం టీజర్‌, ట్రైలర్లకు కూడా మంచి స్పందన వచ్చింది. ట్రైలర్‌ విడుదలైన 9గంటలోనే 20లక్షల మంది వ్యూవర్స్‌ని సాధించింది. 

ఇక గోపీసుందర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఆల్‌రెడీ విడుదలైన ఓ పాట ఒక ఊపు ఊపుతోంది. ఇక మొత్తం ఆడియో ఈనెల 29వ తేదీన ఫిల్మ్‌నగర్‌లోని జెఆర్సీ కన్వెక్షన్‌ సెంటర్‌లో సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేడుకకు బన్నీ ముఖ్య అతిధిగా వస్తుండటం విశేషం. దీంతో బన్నీని చూసి చాలా కాలమైన అభిమానులు ఈ వేడుకకు పోటీ పడటం ఖాయమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం విజయ్‌దేవరకొండ 'గీతగోవిందం'తో పాటు 'ట్యాక్సీవాలా, నోటా, డియర్‌ కామ్రేడ్‌' చిత్రాలలో నటిస్తున్నాడు.

Allu Arjun's Support for Geetha Govindam:

Allu Arjun Supports Geetha Govindam    
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs