Advertisement
Google Ads BL

కొంటె జంట చిలిపి మాటలు..!


తాజా టాలీవుడ్‌ యంగ్‌ కపుల్స్‌లో అక్కినేని నాగచైతన్య, సమంతలది మొదటి స్థానం. ఇక వీరిద్దరు మాటలు చెప్పడంలో, సమయస్ఫూర్తిగా మాట్లాడటంలో బహునేర్పరులు, మరీ ముఖ్యంగా సమంత అయితే ఏ విషయంపైన అయినా సూపర్‌గా స్పందిస్తుంది. ఇక విషయానికి వస్తే అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున మేనల్లుడు సుశాంత్‌ ఇప్పటి వరకు దాదాపు అరడజను చిత్రాలు చేసినా కూడా ఆయనకు కనీసం యావరేజ్‌ చిత్రం కూడా లేదు. నటన, అందం, టాలెంట్‌ విషయంలో ఈయన కంటే సుమంతే బెటర్‌ అని అందరు ఒప్పుకుంటారు. మరి సుమంత్‌కే సరైన సినిమాలు లేనప్పుడు సుశాంత్‌ నుంచి ఏదో ఆశించడం పొరపాటే అవుతుంది. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా సుశాంత్‌, రుహాని శర్మ హీరో హీరోయిన్లుగా 'అందాల రాక్షసి' ఫేమ్‌ రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా 'చి.ల.సౌ' అనే చిత్రం రూపొందింది. ఈ చిత్రం విడుదలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో యూనిట్‌ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా సుశాంత్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ, హలో బాయ్స్‌ అండ్‌ గాళ్స్‌, నా బ్యాచులర్‌ పార్టీకి మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాను. నేను ఇచ్చిన గూగుల్‌ లింక్‌ని తెరచి, పెళ్లిని వాయిదా వేయడం కోసం మీరు ఏ కారణం చెబుతారో తెలియజేయండి. గెలుపొందిన వారికి విడుదలకు ముందే సినిమా చూపించి, అద్భుతమైన పార్టీ ఇస్తానని ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశాడు. 

దీనికి నాగచైతన్య ఫన్నీగా స్పందించాడు. దట్స్‌ క్రేజీ మ్యాన్‌. కేవలం బ్యాచ్‌లర్స్‌నే పిలుస్తావా? నన్ను మర్చిపోయినట్లు ఉన్నావు. నాలోని బ్రహ్మచారి ఇంకా బతికే ఉన్నాడు.. అని పోస్ట్‌ పెట్టాడు. దీనిపై సమంత కొంటెగా స్పందించింది. 'భర్తగారూ.. మీరు చెప్పింది నిజమే..' అని వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ పోస్ట్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మొత్తానికి ఇటీవల సుమంత్‌ చిత్రానికి ప్రమోషన్‌ చేసిపెట్టిన ఈ అక్కినేని జంట ప్రస్తుతం సుశాంత్‌ సినిమా ప్రమోషన్‌ బాద్యతలను తమ భుజాలపైకి ఎత్తుకున్నట్లు అనిపిస్తోంది. మరి ఈ చిత్రమైనా సుశాంత్‌కి సరైన గుర్తింపును తీసుకుని వస్తుందో లేదో వేచిచూడాల్సివుంది..! 

Funny Conversation Between Samantha and Naga Chaitanya:

Samantha and Naga Chaitanya Promotes Chi La Sow Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs