Advertisement
Google Ads BL

దేవదాస్ లో నాగ్ పాత్ర ఇదేనా..!


జై లవ కుశ లో క్రూరుడైన జై పాత్రని సినిమా చివరిలో కథానుసారంగా చంపేస్తే.. దానికి చాలామంది తెగ బాధ పడ్డారు. మరి క్రూరత్వం నిండిన జై లో అలా బాధపడిన వారికి ఒక ఎన్టీఆర్ కనిపించాడు. స్టార్ హీరో ఎన్టీఆర్ పాత్రని అలా చంపేసి విషాదం మిగల్చడం అనేది చాలామందికి రుచించదు. అలాగే సినిమాల్లో హీరోపాత్రలను అనుకోకుండా ముగించేస్తే ఇలానే తెగ బాధపడతారు ప్రేక్షకులు. హీరోలంటే కేవలం హీరోయిజం అనేది వారికి కావాల్సిన పాయింట్. అంతేగాని విలన్ తో దెబ్బలుతిన్నా.... హీరో పాత్రలో విషాదం ఉన్నా తట్టుకోలేరు. అందుకే దర్శకులు కూడా  హీరోయిజాన్ని హైలెట్ చేస్తూ చూపిస్తారు. చాలా రేర్ అంటే రేర్ గానే కథానుగుణంగా కథ డిమాండ్ చేస్తే గనక హీరో పాత్రని విషాదం చేస్తారు. 

Advertisement
CJ Advs

అయితే తాజాగా నాగార్జున చేస్తున్న సినిమాలో నాగ్ పాత్రని చంపేస్తున్నాడట దర్శకుడు. ఇంతకీ ఆ కథా కమామిషు ఏమిటంటే.. నాగార్జున - నాని కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో దేవదాసు అనే మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ లో నాగ్ పాత్రకు విషాద ముగింపు ఉంటుందనే వార్త ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. అయితే బయట వినబడుతున్న కథనం ప్రకారం దేవదాసు సినిమా పూర్తి అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా కాదట. అవసరం మేరకు కామెడీతో పాటుగా ఈ సినిమాలో చాలా ఎమోషన్స్ కూడా ఉంటాయని...  ఫస్ట్ హాఫ్ లో కామెడీ దట్టించినా...సెకండ్ హాఫ్ లో మాత్రం ఎమోషన్స్ తో కూడిన కథగా ఈ సినిమాని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నాడట.

అయితే సినిమా మొత్తం కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున పాత్రని ఎందుకు ముగించాల్సి వస్తుందో తెలియదు గాని... ఈ మల్టీస్టారర్ లో నాగ్ పాత్రకి విషాదం తప్పదట. మరి నాగార్జున పాత్ర చనిపోవడం అంటే అక్కినేని అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు గాని... సినిమా చూశాక మాత్రం నాగ్ పాత్ర విషాదం సీన్స్ కి బాగా ప్లాట్ అవుతారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు దేవదాస్ చిత్ర బృందం. ఇక నాగార్జున తాను హీరోగా చేసిన కొన్ని సినిమాల్లో కథానుగుణంగా నాగ్ పాత్ర మరణిస్తుంది కూడా. అందులో చాలా సినిమాలు హిట్ కూడా అయ్యాయి. మరి ఈ సినిమా కూడా హిట్ అవుతుంది అనే నమ్మకం చాలామందిలో ఉంది.

Nagarjuna Role in Devadas Movie Revealed:

Nagarjuna Role Dead in Devadas Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs