Advertisement
Google Ads BL

ఈ ప్లేబోయ్‌ గుట్టు రట్టు చేసింది....!


బాలీవుడ్‌ యంగ్‌స్టార్‌ రణబీర్‌కపూర్‌కి ప్లేబోయ్‌ ఇమేజ్‌ ఉంది. సోనమ్‌కపూర్‌, దీపికాపదుకొనే, కత్రినా కైఫ్‌, అలియాభట్‌ వంటి ఎందరో ఆయన లిస్ట్‌లో ఉన్నారు. తాజాగా ఆయన అలియాభట్‌తో నడుపుతున్న వ్యవహారం పెళ్లి దాకా వెళ్తుందనే వార్తలు వినవస్తున్నాయి. ఇక 2007లో రణబీర్‌, దీపికా మధ్య ఎఫైర్‌ నడిచింది. అయితే ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు. తాము ఎందుకు విడిపోయామో తాజాగా దీపికా పదుకోనే వెల్లడించింది. 

Advertisement
CJ Advs

ఆమె మాట్లాడుతూ, ఓ అనుబంధంలో ఉన్నప్పుడు నేను నా పార్ట్‌నర్‌ని ఎప్పుడు మోసం చేయలేదు. నమ్మిన వ్యక్తిని మోసగిస్తే ఇక ఆ బంధానికి, అనుబంధానికి విలువేముంటుంది? రణబీర్‌ నాకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు. కానీ మరోసారి ఆయన చేతిలో ఫూల్‌ని కావడం నాకిష్టం లేదు. అందుకే విడిపోయాను. విడిపోయిన తర్వాత మానసికంగా కృంగిపోయాను. డిప్రెషన్‌లోకి వెళ్లాను. ఆ తర్వాత ఆ బాధ నుంచి నెమ్మదిగా బయటపడ్డాను అని చెప్పుకొచ్చింది. 

మొత్తానికి బ్రేకప్‌ల వెనుక ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఇలాంటి ప్రతి ఒక్కరి జీవితాలలో ఇవి ఉంటూనే ఉంటాయి. నమ్మిన వారిని మోసం చేయడం పాపం అనే వారితో పాటు నమ్మిన వారిని తప్పితే, నమ్మని వారిని ఎలా మోసం చేయగలం? అనేది మరికొందరి వాదన. 

Deepika Padukone on Ranbir Kapoor's Disloyalty:

When Padmaavat actress Deepika Padukone caught ex-bf Ranbir Kapoor red-handed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs