Advertisement
Google Ads BL

బన్నీ ఫ్యామిలీ పిక్ అదిరింది..!


ఒక సినిమా లైన్‌లో ఉండగానే తదుపరి చిత్రం, దర్శకుడు వంటి విషయాలలో స్టార్‌ హీరోలు చేయబోయే తదుపరి చిత్రం గురించి ప్రేక్షకులకు ఏదో ఒక హింట్‌ వస్తూ ఉంటుంది. ఫలానా దర్శకులు, నిర్మాతలు అంటూ ఇద్దరు ముగ్గురి పేర్లయినా ప్రచారంలోకి వస్తాయి. ఈ విషయంలో స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా కాస్త స్పీడుగానే ఉంటాడు. బన్నీ 'డిజె' చిత్రం చేస్తున్న సమయంలోనే రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ లగడపాటి శ్రీధర్‌ దర్శకత్వంలో 'నా పేరు సూర్య...నా ఇల్లు ఇండియా' చిత్రం చేస్తాడని లీక్‌లు వచ్చాయి. చివరకు అదే నిజమైంది. అయితే ఈ చిత్రం తర్వాత అల్లుఅర్జున్‌ సుకుమార్‌తో చేస్తాడని, విక్రమ్‌ కె.కుమార్‌కి ఓకే చెప్పాడని వార్తలు వచ్చినా ఏదీ నిజం కాదని తేలిపోయింది. 

Advertisement
CJ Advs

ఇక ఎప్పటినుంచో అనుకుంటున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం లింగుస్వామితో ఉంటుందని మరికొందరు భావించారు. అయితే అటు మహేష్‌ ఇలా ద్విభాషా చిత్రంగా 'స్పైడర్‌' చేసి ఘోరపరాజయం మూటగట్టుకోవడంతో అలా చేయడం సబబేనా కాదా? అనే మీమాంసలో బన్నీ పడ్డాడని అంటున్నారు. అందుకే ఆయన ద్విభాషా చిత్రాన్ని కూడా పక్కన పెట్టేశాడని తెలుస్తోంది. ఇక బన్నీ ఎంత చెప్పినా కూడా 'డిజె, నా పేరు సూర్య...నా ఇల్లు ఇండియా' చిత్రాలు రెండు యావరేజ్‌లుగానే మిగిలాయి. బన్నీతో ఈ రెండు చిత్రాలు తీసిన హరీష్‌శంకర్‌, వక్కంతం వంశీలకు మరో చిత్రం చేతిలో లేదు. దాంతో బన్నీ కొంత గ్యాప్‌ తీసుకుని, మరలా ట్రాక్‌లోకి ఎక్కడానికి తన తండ్రితో కలిసి వ్యూహరచన చేస్తున్నాడని, అందుకే కాస్త గ్యాప్‌ ఎక్కువవుతోందని చెబుతున్నారు. 

ఇక తాజాగా బన్నీ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే అది తన వృత్తిపర జీవితం ద్వారా కాకుండా తన వ్యక్తిగత ఫ్యామిలీ ఫొటోల ద్వారా కావడం విశేషం. తాజాగా బన్నీ తన భార్య స్నేహ, సంతానమైన అయాన్‌, అర్హల ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారి హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ముగ్గురు కలిసి ఉన్న ఫొటోలనే కాదు.. భార్య స్నేహ, కుమారుడు అయాన్‌ల సింగిల్‌ ఫొటోలను కూడా ఆయన పోస్ట్‌ చేయడంతో అందరు క్యూట్‌గా ఉన్నారని ఫ్యాన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు. మరి బన్నీ చిత్రం ఏమిటో ఖరారయ్యే దాకా బన్నీ ఫ్యామిలీకి సమయం కేటాయించి, ఇలాంటి ఫొటోలతో తన ఫ్యాన్స్‌ని అలరిస్తుండటం విశేషమనే చెప్పాలి. 

Sneha, Ayaan, Arha's Pic Goes Viral:

Sneha, Ayaan, Arha: How Pretty They Are!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs