Advertisement
Google Ads BL

ఈ హీరోకి రోజుకి 6 కోట్లు కావాలంట..!


బాలీవుడ్ లో రణబీర్ కపూర్ ఎప్పుడూ అమ్మాయిలను ప్రేమిస్తూ ఉంటూ వారి వెనక పడతాడే గాని కెరీర్ ని సీరియస్ గా తీసుకోడని అంటారు. బర్ఫీ సినిమా ఇలా మచ్చుకు కొన్ని సినిమాలు మాత్రమే అతని కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నాయి. దీపికాతో లవ్ ఎఫైర్ నడిపిన రణబీర్ కపూర్ తర్వాత కత్రినా కైఫ్ తో సహా జీవనం చేశాడు. మరి దీపికా కావాలనే రణబీర్ తో బ్రేకప్ చేసుకుంది. రణబీర్ కపూర్ రెడ్ హ్యాండెడ్ గా దొరకడం వలెనే తనతో బ్రేకప్ చేసుకున్నట్లుగా దీపికా చెప్పింది. ఇక తర్వాత కత్రినాతో  ప్రేమాయణం డీప్ గా నడిపిన రణబీర్ కి కత్రినాతో కూడా చెడింది. తాజాగా అలియా భట్ తో తిరుగుతున్నాడు. ఇక వారి మధ్యన ఏదో సంథింగ్ సంథింగ్ అంటూ బిటౌన్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

Advertisement
CJ Advs

అయితే అలా రణబీర్ నిత్యం వార్తల్లో ఉంటే తాజాగా సంజయ్ దత్ బయోపిక్ 'సంజు' తో ఒక్కసారిగా లైం టైంలో కొచ్చేశాడు. సంజయ్ దత్ బయోపిక్ లో అచ్చం సంజయ్ దత్ లా నటించి మార్కులు కొట్టేసిన రణబీర్ ఆ సినిమాతో 500  కోట్ల క్లబ్బులో జాయిన్ అయ్యాడు. సంజు సినిమా హిట్ టాక్ తో కోట్లు కొల్లగొడుతుంది. ఇప్పటికే 500 కోట్లు పైచిలుకు కలెక్షన్లు సాధించినట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి తన వలన భారీగా కలెక్షన్స్ వస్తుండడం చూసిన రణబీర్ కపూర్ తన రెమ్యునరేషన్ ని భీభత్సంగా పెంచేశాడట. సినిమాల్లోనే కాదు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్న కొన్ని బ్రాండ్స్ విషయంలోనూ రణబీర్ తన పారితోషకాన్ని తెగ పెంచేశాడనే టాక్ వినబడుతుంది.

రణబీర్ కపూర్ చేతిలో బ్రహ్మస్త్ర మూవీతోపాటుగా 10కి పైగా టాప్ బ్రాండ్లను కలిగివున్నాడని చెబుతున్నారు. ఇక ఆ బ్రాండ్స్ ని ప్రమోట్ చేసినందుకుగాను... రణబీర్ ఇప్పటి వరకు రోజుకు 3 కోట్లనుండి, 3.5 కోట్లవరకు తీసుకుంటున్నాడట. అయితే సంజు హిట్ తో రణబీర్ తన బ్రాండ్స్ వాల్యూని రోజుకి 6 కోట్లు వరకు వసూలు చేస్తున్నట్లుగా టాక్ నడుస్తుంది. మరి నిన్నమొన్నటి వరకు సాధారణ హీరోగా ఉన్న రణబీర్ అమాంతం స్టార్ హోదాలోకొచ్చేశాడు. అందుకే తన పారితోషకాన్ని డబుల్ చేసిపారేశాడు. మరి సినిమాలు హిట్ అయితే అంతే... అదే గనక ప్లాప్  అయితే పాతాళానికే.

Ranbir Kapoor's Whopping Endorsement Fee Hike:

Ranbir Kapoor doubles endorsement fee to Rs 6 cr after Sanju box office success  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs