Advertisement
Google Ads BL

ప్రభాస్ తో అని, ఈ హీరోకి ఫిక్సయింది..!


RX 100 సినిమా హిట్ అవడానికి మెయిన్ కారణం ఆ సినిమాలో నటించిన హీరోయిన్ పాయల్ రాజపుట్. నెగెటివ్ షేడ్స్ ఉన్న అమ్మాయిగా హీరో కార్తికేయని మోసం చేస్తూ తన కోర్కెలు తీర్చుకునే అమ్మాయిగా పాయల్ రాజపుట్ నటనకు అందరూ మెచ్సేశారు. ఇంకేంటి ఈ అమ్మాయి టాలీవుడ్ లో బిజీ అవుతుంది అనుకున్నారు. అయితే పాయల్ కి మళ్లీ RX సినిమాలోని పాత్రల వంటి పాత్రలే రావడంతో ఆమె సినిమాలను రిజెక్ట్ చేసినట్లుగా వార్తలొచ్చాయి. మరి అది నిజమో కాదో అనేది తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం పాయల్ రాజపుట్ కి తెలుగులో ఒక యంగ్ హీరో పక్కన సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పాయల్ రాజపుట్ కి ఒక ఛాన్స్ వచ్చిందని సోషల్ మీడియాలో వినబడుతుంది. ప్రస్తుతం రేపు 'సాక్ష్యం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ తర్వాత ఒకేసారి రెండు ప్రాజెక్టులలో కమిట్ అయ్యాడు. ఒకటి డెబ్యూ డైరెక్టర్ శ్రీనివాస్ దర్శకత్వంలోను, మరొకటి దర్శకుడు తేజ డైరెక్షన్ లోను బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఆ రెండు సినిమాల్లోనూ బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడిగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుంది. మరి ఒక సినిమాలో భారీ పారితోషకాన్ని.. మరొకటి అంటే తేజ డైరెక్షన్ లో బెల్లంకొండ పక్కన నటించబోయేది డైరెక్టర్ తేజ కోసం.. అలాగే అ సినిమాలో హీరోయిన్ పాత్రకి హీరో పాత్ర కంటే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి.

అయితే శ్రీనివాస్ డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న సినిమాలో మెయిన్ హీరోయిన్ కాజల్ కాగా రెండో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. అందుకే ఆ పాత్ర కోసమే RX బ్యూటీ పాయల్ రాజపుట్ ని సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఇక తన పాత్ర తీరుతెన్నులు నచ్చిన పాయల్ రాజపుట్ ఆ ఆఫర్ ని ఒప్పుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరి సెకండ్ హీరోయిన్ అయినా పాత్ర ప్రాధాన్యం ఉంటే.. ఆటోమాటిక్ గా వారికి మంచి పేరొస్తుంది. అందుకే పాయల్ రాజపుట్ సెకండ్ హీరోయిన్ పాత్రకి ఒప్పుకుందన్నమాట.

Payal Rajput in Bellamkonda Srinivas Film:

Payal Rajput Got One More Offer in Tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs