Advertisement
Google Ads BL

ఈ నటి పేరు జంతువులకు పెట్టారు!


సినీ సెలబ్రిటీలలో జంతు ప్రేమికులు, బ్లూక్రాస్‌తో పాటు పెటా వంటి వాటి కార్యక్రమాల్లో పాలు పంచుకునే వారు చాలామంది ఉన్నారు. తెలుగు నటుడైన సాయికిరణ్‌ అయితే ఏకంగా పాములను పెంచుతాడు. రామ్‌చరణ్‌, అమల వంటి వారు గుర్రాలు, ఏనుగులు, పులులను కూడా పెంచేవారు ఉన్నారు. ఈ కోవలోకి వచ్చే నటే బాలీవుడ్‌ హీరోయిన్‌ దియా మిర్జా. ఈమె జంతు ప్రేమికురాలు. జంతువులను, పర్యావరణాన్ని రక్షించే కార్యక్రమాలల్లో యాక్టివ్‌గా ఉంటూ ఉంటుంది. ఈమె యూఎస్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. 

Advertisement
CJ Advs

కాగా కెన్యాలోని పెజెటా జంతు ప్రదర్శనశాలలో ఇటీవల ఓ ఖడ్గమృగానికి పిల్ల పుట్టింది. దానికి దియా మిర్జా అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌ ద్వారా తెలుపుతూ హర్షం వ్యక్తం చేసింది. ఆ పిల్లకు నా పేరు పెట్టిన నిర్వాహకులకు ధన్యవాదాలు, అరుదైన జంతువులను సంరక్షించేందుకు నడుం బిగించండి. మీ మద్దతు ఇవ్వండి. పెజెటా జంతు ప్రదర్శన శాలను సందర్శించండి. అక్కడికి వెళ్లిన వారు దియామిర్జా పిల్లతో ఫొటోలు దిగండి. ఆ ఫొటోలను నాకు ట్యాగ్‌ చేయండి. ఇలా చేసిన వారికి ఉచితంగా విహారయాత్రలకు వెళ్లడానికి ఎయిర్‌ అరేబియన్‌ గ్రూప్‌ టిక్కెట్లు ఇస్తోంది... అని తెలిపింది. 

ఇప్పటికే దియా మిర్జా లక్నో జంతు ప్రదర్శన శాలకు చెందిన రెండు పులి పిల్లలను దత్తత తీసుకుంది. దాని సంరక్షణను ఆమె చూసుకుంటోంది. ఈ పిల్లల తల్లి పేరు కూడా దియానే కావడం విశేషం. మరోపక్క ఆమె సినిమాలలో కూడా బిజీగా ఉంది. 'సంజు' చిత్రంలో ఈమె సంజయ్‌ భార్య మాన్యతాదత్‌ పాత్రను పోషించి ప్రశంసలు పొందుతోంది.

Dia Mirza Name to Animals :

Actor Dia Mirza Adopts African Baby Rhino, Guess What Its Name Is
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs