Advertisement
Google Ads BL

నాకు, అతనికి.. డ్యాష్‌ డ్యాష్‌ లేదంటోంది!


బిగ్‌బాస్‌ సీజన్‌2 మొదలైనప్పటి నుంచి అందులో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచిన పార్టిసిపెంట్‌ తేజస్వి. అంతగా ఆ షోలో ఆమె హడావుడి చేసింది. అలకలు.. విసుర్లు..కోపాలు.. ఆటపట్టించడాలు.. చేస్తూ ఈ షోకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ షోలో మరో పార్టిసిపెంట్‌ సామ్రాట్‌తో ఆమె ప్రవర్తించిన తీరు, వారు నడుచుకున్న విధానం చూసిన అందరూ వారి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ ఉందనే అనుమానించారు. ఇంతలో హఠాత్తుగా తేజస్వి ఈ షో నుంచి ఎలిమినేట్‌ అయింది. 

Advertisement
CJ Advs

తాజాగా ఆమె ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ, అందరూ సామ్రాట్‌కి, నీకు మధ్య ఏముంది? అని అడుగుతున్నారు. మా మధ్య ఏమీ లేదు. ఆయన ఒక మంచి మనిషి. అలాగే తనీష్‌ కూడా. మంచి మనుషులంతా కలిస్తే ఫ్రెండ్స్‌ అవుతారు. వాళ్లని ఓ టీమ్‌ అనవచ్చు. మరేదైనా అనొచ్చు. ఈ షోలో సామ్రాట్‌ని చూపించకుండా ఎక్కువగా నన్నే చూపించారు. నేను అరవడం, తిట్టడం, నాగురించి వేరేవాళ్లు మాట్లాడుకోవడం చూపించారు. 

మరలా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లాలనుంది. అది మీ చేతుల్లోనే ఉందని చెప్పుకొచ్చింది. అయినా మొదట్లో ఇతరుల గురించి ప్రతి ఒక్కరూ స్నేహితుడనే అంటారు. ఆ తర్వాత పరిస్థితులు మారుతాయని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈమెకి గతంలో కూడా నవదీప్‌తో ఎఫైర్‌ ఉందని పలు వార్తలు షికారు చేసిన విషయం తెలిసిందే. 

Tejaswi Madivada on negativity and love with Samrat Reddy:

Tejaswi Madivada clears air over her relationship with Samrat
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs