జగన్‌ది విభిన్నమైన వ్యక్తిత్వం. ఆయనకు మద్దతు ఇచ్చిన మైసూరారెడ్డినే కాదు సబ్బంహరి, ఉండవల్లి, లగడపాటి నుంచి కొండా సురేఖ వరకు ఆయన ఎందరినో ఇబ్బందుల పాలు చేసి వారిని దూరం చేసుకున్నాడు. వైఎస్‌కి ఆత్మగా భావించే కెవిపి రామచంద్రరావు, సూరీడు వంటి వారు ఆయనకు దూరంగా జరిగారు. ఇక ఆయన తన బాబాయ్‌నే కాదు తల్లిని, చెల్లిని, బావని కూడా నమ్మని విచిత్ర మనస్తత్వంగా అందరూ చెబుతారు. మరోవైపు ఆయన వచ్చే ఎన్నికల్లో తానే సీఎం అవుతానని, మీ అన్న అధికారంలోకి వస్తాడు... మీ కోర్కెలు తీరుస్తాడని తనకి తానే చెప్పుకుంటూ జనాలను చూసి ఊహాలోకంలో బతుకుతున్నాడు. తన తండ్రి శవం ఉండగానే ఎమ్మెల్యేల సంతకాలను సేకరించి ముఖ్యమంత్రి కావాలని భావించాడన్న ఆరోపణ కూడా ఉంది. కేవలం తన సభలకు వచ్చే జనం మీద తప్పితే ఆయనకు మరో ధ్యాస ఉండదు. తనకు తాను మానవాతీతుడినని నమ్ముతుంటాడు.
ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పదవికైనా గౌరవం ఇవ్వకుండా గుడ్డలూడదీసి కొట్టండి.. నడిరోడ్డులో ఉరితీయండి, బహిరంగంగా కాల్చిచంపండి... ఇలా తన నోటికి వచ్చినవి మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఒక అబ్బా, అమ్మకు చంద్రబాబు పుట్టాడా? అని దిగజారుడు భాష మాట్లాడుతుంటాడు. ఈయనకు అలాగే మాట్లాడే రోజా, చెవిరెడ్డి, విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబులంటేనే ఇష్టం. ఇక చంద్రబాబు, పవన్‌లు మంచివారా? నిజాయితీపరులా? అనేది పక్కనపెడితే.. బాబుగానీ, పవన్‌గానీ ఎప్పుడు దిగజారుడు వ్యాఖ్యలు, విమర్శలు చేయలేదు. అవినీతి ఆరోపణలు, మాటల నిలకడలేమి వంటివి వారికి ఉండవచ్చు గానీ మరీ బజారు వ్యాఖ్యలు చేయలేదు.
కానీ తాజాగా జగన్.. పవన్‌పై చేసిన వ్యాఖ్యలు అత్యంత అమానుషమైనవనే చెప్పాలి. ఆయన మాటలను వింటే ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే ఆయన ఎలా ప్రవర్తిస్తాడు? ఎలా పాలిస్తాడు? ఎవరి మాటలు వింటాడు? ఏ స్థాయిలో అరాచకంగా ఉంటుంది? అనేవి ఆయన మాటలను బట్టి అంచనా వేయవచ్చు. ఆయన పవన్ గురించి మాట్లాడుతూ, మన ఖర్మ ఏమిటంటే.. ఈరోజు పవన్‌కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడుతున్నా వినాల్సివస్తోంది. నిజంగా ఇది మన ఖర్మే. నాలుగేళ్లు ఈ పెద్ద మనిషి టిడిపితోనూ, బిజెపితోనూ కాపురం చేశాడు. ఎన్నికలకు ఆరునెలల ముందు బయటికివచ్చి తాను పతివ్రతుడిని అని అంటున్నాడు. ఈ ముగ్గురు కలిసి ఏపీని పొడిచేశారు. పొడిచేసిన తర్వాత నాలుగేళ్లు మౌనంగా ఉన్నారు. కలసికట్టుగా సంసారం చేశారు. ఆరునెలల ముందు బయటికి వచ్చి ఒక్కోక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. ఒకరేమో నేను తప్పు చేశాను అంటాడు. మరొకరు నేనేమీ చేయలేదు. మిగిలిన ఇద్దరు చేశారు అంటాడు. మరోకాయన ఇద్దరు చెప్పిన తర్వాతే అంటాడు. పవన్ ఆరునెలలకోసారి బయటకు వస్తాడు. ఓ రోజు ఓ ట్వీట్ ఇస్తాడు. లేదంటే ఓ ఇంటర్వ్యూ ఇస్తాడు.. పోతాడు. నాలుగేళ్లుగా మనం చూసింది ఇంతే. అలాంటి వ్యక్తి రాజకీయాలు మాట్లాడటం మొదలుపెడితే దానికి మనం సమాధానం చెప్పాలంటే ఎక్కడ ఉన్నాయి విలువలు? విలువల గురించి పవన్ మాట్లాడుతాడు. నిజంగా ఆయనకి ఎక్కడ విలువలున్నాయి? అని వ్యాఖ్యానించాడు.
ఇంత వరకు జగన్ మాట్లాడిన దాంట్లో పెద్దగా తప్పులేదు కానీ ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, ఆయనకు నలుగురు పెళ్లాలు. కార్లను మార్చినట్లు పెళ్లాలను మారుస్తాడు...నాలుగేళ్లకోసారో, ఐదేళ్లకోసారో పెళ్లాన్ని మారుస్తాడు. మీరో, నేనో ఆ పని చేస్తే నిత్యపెళ్లికొడుకు అని బొక్కలో వేస్తారు. వారి గురించి రాజకీయాలలో మాట్లాడాల్సిరావడం చూస్తే నిజంగా రాజకీయాలు ఎంత దిగజారి పోయాయో అనిపిస్తోందని వ్యక్తిగత దూషణలను జగన్ దిగడం హేయమని చెప్పాలి. పవన్ వ్యక్తిగత విషయాల గురించి జగన్ వ్యాఖ్యానించడం సరికాదు. పవన్ తన భార్యలకు చట్టప్రకారం విడాకులిచ్చి, భరణంఇచ్చి విడిపోయాడు. అంతేగానీ ఉంచుకోవడాలు, తండ్రి అధికారాన్ని చేతిలో ఉంచుకుని హీరోయిన్లను బెదిరించి అనుభవించడాలు చేయలేదు.
రాజశేఖర్‌రెడ్డి రాజకీయాలు మాట్లాడాడంటే అర్ధముంది. అందుకు ఆయన ఎన్నో ఏళ్లు కష్టపడ్డాడు. కానీ నిన్నగాక మొన్న లక్షల కోట్లు లూటీ చేసిన వచ్చిన జగన్, ఏమీ తెలియని ఆమె తల్లి విజయమ్మ, ఆయన సోదరి షర్మిలా రాజకీయాల గురించి మాట్లాడుతుంటే వినాల్సిరావడం ఏపీ ప్రజల దౌర్భాగ్యం. ఈ విషయంలో జగన్ సచ్చీలుడా? షర్మిల, అనిల్‌కుమార్‌లు సచ్చీలురా? ఒక్కసారి వారి జాతకాలను తిప్పి చూస్తే వారి చరిత్ర ఏమిటో తెలుస్తుంది. వాస్తవానికి పవన్, జగన్‌ని ఉద్దేశించి చెడుగా ఏమీ మాట్లాడలేదు. జగన్ అసెంబ్లీ నుంచి పారిపోయాడని, నేనైతే పది మంది ఎమ్మెల్యేలు ఉంటే సభలోనే ఉండి సభను స్తంభింపజేసేవాడినని మాత్రమే అన్నాడు. కానీ జగన్ వ్యవహారశైలి అలా లేదు. జగన్ నీతులు చెప్పడం చూస్తే బాధ కలగకమానదు. ఇంతకాలం రాజకీయ విశ్లేషకులు వచ్చే ఎన్నికల్లో వైసీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. కానీ ఈ వ్యాఖ్యలతో పవన్ రాబోయే కాలంలో ఒక్కడిగా, మరీ అయితే వామపక్షాలతో మాత్రమే కలిసి నడుస్తాడని అర్ధమవుతోంది.