శ్రీదేవికి టాలీవుడ్, బాలీవుడ్ లో ఎంత కేజ్ ఉందో వేరే చెప్పక్కర్లేదు. ఆమె అందం, నటన, అభినయం ఇవన్నీ శ్రీదేవికి దేవుడిచ్చిన వరం. అలాంటి శ్రీదేవి నూరేళ్లు నిండకముందే అనుకోని విధంగా మరణించింది. అయితే తాను పోతూ పోతూ తన కూతురుని వెండితెరకు పరిచయం చేసి మరీ వెళ్ళిపోయింది. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ నటనలోనూ, డాన్స్ లోనూ శిక్షణ తీసుకుని మరి సినిమాల్లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. మరాఠిలో సూపర్ హిట్ ఫిలిం 'సైరత్' ని బాలీవుడ్ లో శశాంక్ దర్శకుడిగా బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ 'ధఢక్' సినిమాని నిర్మించాడు. ఇషాన్ కట్టర్ హీరోగా జాన్వీ కపూర్ ఆ సినిమాలో సింపుల్ గా నటించేసింది. ఆ సినిమా గత వారమే విడుదలైంది. అయితే సినిమా టాక్ బాగోకపోయినా.. శ్రీదేవికున్న అభిమాన గణం ఆమె కూతురు జాన్వీ కపూర్ ని ఎంతగా ఆదరించిందో 'ధఢక్' సినిమా కలెక్షన్స్ చెప్పేస్తున్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ సాధారణ అమ్మాయిలా... నార్మల్ లుక్స్ లో.. ట్రెడిషనల్ గా అదరగొట్టింది. మొదటి సినిమా కాబట్టి నటన అంతంత మాత్రంగా వుంది కానీ... ప్రతి ఫ్రేమ్ లోను శ్రీదేవి అభిమానులు జాన్విలో ఆమె తల్లిని చూసుకున్నారు. మరి అక్కడ ప్లాప్ టాక్ వచ్చినా... హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమాతో జాన్వికి కొత్త ఉత్సాహం వచ్చేసింది.
అక్కడ జాన్వీ కపూర్ క్రేజ్ కి ఇక్కడ టాలీవుడ్ నిర్మాతలు పడిపోతున్నారు. టాలీవుడ్ లో శ్రీదేవికి మాములు క్రేజ్ లేదు. ఆమె అప్పట్లో స్టార్ హీరోలందరి సినిమాల్లోను నటించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, నాగార్జున, చిరంజీవి వంటి బడా హీరోలతో నటించింది. అందుకే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు శ్రీదేవిని ఆరాధించే వారు చాలామందే ఉన్నారు. అందుకే శ్రీదేవి క్రేజ్ ని జాన్వీతో క్యాష్ చేసుకోవాలని టాలీవుడ్ నిర్మాతలు ఫిక్స్ అవుతున్నారు. ఇక శ్రీదేవి భర్త బోనికపూర్ కి కూడా తెలుగు వారితో మంచి పరిచయాలే ఉన్నాయి. శ్రీదేవి భర్తగా బోనికి.... ఆమెకెంత గౌరవం ఇస్తారో ఆయనకి అంతే గౌరవం ఇచ్చేవారు తెలుగువారు. ఇక బోని కూడా తన కూతురు జాన్విని తెలుగుకి కూడా పరిచయం చేసే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు... బోణి కపూర్ తో ఫోన్ లో చర్చలు జరిపినట్టుగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోతో తాను నిర్మించే చిత్రంలో జాన్వీ కపూర్ ని తెలుగులో భారీగా గ్రాండ్ ఎంట్రీ ఇప్పించాలని దిల్ రాజు భావిస్తున్నాడట. ఈ విషయాన్ని బోనీతో దిల్ రాజు చర్చినట్లుగా చెబుతున్నారు. మరో పక్క రాజమౌళి తన బడా మల్టీస్టారర్ లో జాన్వీ కపూర్ కి హీరోయిన్ అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడని... తన సిసినిమాలో జాన్వీ కపూర్ నటిస్తే శ్రీదేవి క్రేజ్ తన సినిమాకు పనికొచ్చే సినిమా వరల్డ్ వైడ్ గా భారీ క్రేజ్ వస్తుందని భావిస్తున్నట్లుగా కూడా వార్తలొస్తున్నాయి. మరి ఈవార్తల్లో నిజమెంతుందో తెలియదు గాని.. అక్కడ హిట్ పడకుండానే ఇక్కడికి దించేస్తున్నారుగా అంటూ కామెంట్స్ అయితే పడుతున్నాయి.