టాలీవుడ్ లో సమంత మాత్రం అనుకున్న టైం కి అనుకున్నట్టుగా తాను కోరుకున్న హీరో నాగ చైతన్య ని పెళ్లాడింది. అలాగే పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఇక సమంత తర్వాత త్రిష, అనుష్క లు పెళ్లి చేసుకోబోతున్నారని న్యూస్ ఉన్నపటికీ... వారు పెళ్ళికి సిద్దమైనట్లుగా కనబడడం లేదు గాని.. శ్రియ శరణ్ ఉన్నట్లుండి ఒక బడా బిజినెస్ మ్యాన్ ని పెళ్ళాడి అందరికి షాక్ ఇచ్చింది. ఇక పెళ్లయ్యాక కూడా శ్రియ సినిమాలకు సైన్ చేసేస్తుంది. ఇక తాజాగా మిల్కి బ్యూటీ తమన్నా పెళ్లి ముచ్చట్లు మొదలైనాయి. తమన్నాకి గత రెండేళ్లుగా అంటే.. బాహుబలి సినిమా తర్వాత మళ్ళీ సరైన ఆఫర్స్ మాత్రం రాలేదు. ఇక అడపా దడపా సీనియర్ హీరోస్ తో కనెక్ట్ అవుతున్న తమన్నా పెళ్లి చేసుకోబోతోందనే న్యూస్ హాట్ హాట్ గా ఫిలిం సర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది.
తమన్నా తన పేరెంట్స్ కి పెళ్లి విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని... ఇక ఆమె తల్లి తండ్రులు తమ్మన్నా కోసం ఒక మంచి సంబంధం చూసి పెళ్లి నిశ్చయించినట్లుగా చెబుతున్నారు. మరి ఆల్రెడీ వరుడు కూడా సిద్దమైన తమన్నాకి ఇక పెళ్లి బాజాలు తరువాయి అన్నమాట. ఇక తమన్నాని పెళ్లి చేసుకోబోయే వరుడు అలాంటి ఇలాంటి వాడు కాదంట. ఏకంగా అమెరికా డాక్టర్ ని తమన్నా పెళ్లాడబోతోందట. అలాగే కేవలం డాక్టర్ మాత్రమే కాదట.. ఆయన గారికి అమెరికాలో చాలా బిజినెస్ లు కూడా ఉన్నాయనే మాట వినబడుతుంది. మరి డాక్టర్ కమ్ బిజినెస్ మ్యాన్ ని తమ్ము బేబీ పెళ్లాడబోతుందన్నమాట.
త్వరలోనే.. తమన్నాకి ఆ డాక్టర్ వరుడికి నిశ్చితార్ధం చేసేసి పెళ్ళికి డేట్ ఫిక్స్ చేసుకుంటారని తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఇరువురు పేరెంట్స్ నిశ్చితార్ధపు డేట్ ని ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. కాగా పెళ్లి తర్వాత తమన్నా సినిమాలు చేస్తుందా... లేదంటే సినిమాలు వదిలేసి డాక్టర్ వెంట అమెరికా చెక్కేస్తోందా అనేది మాత్రం స్పష్టత లేదు. ఇక తమన్నా ప్రస్తుతం ఎఫ్ 2 లో వెంకటేష్ పక్కన, తెలుగు క్వీన్ సినిమాలోనూ నటిస్తుంది.