టాలీవుడ్ లో మలయాళీ కుట్టి సాయి పల్లవి 'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసి పడేసింది. అయితే ఆ సినిమాలో ఆమె నటనను పొగిడిన నోళ్లే ఆమెకు అంత గీరేంటి అంటూ సోషల్ మీడియాలో చాలా సార్లు ట్రోల్ కూడా చేశారు. మరి 'ఫిదా' సినిమాలో భానుమతిగా అందరి మనసులను కొల్లగొట్టింది. కానీ సాయి పల్లవికి పొగరెక్కువ. తన పాత్రకి ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు ఒప్పుకుంటుందనే టాక్ ఉంది. ఇక గతంలో శ్రీనివాస కళ్యాణం సినిమాలో తన పాత్రకి ప్రాధాన్యత లేకపోవడం వలనే ఆమె ఆ సినిమా ఒప్పుకోలేదని.. తనకి హిట్ ఇచ్చిన నిర్మాతకు మొహమాటం లేకుండా నో చెప్పిందని అన్నారు. అలాగే దిల్ రాజు నిర్మాతగా నానితో కలిసి 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమా సెట్స్ లో షూటింగ్ స్పాట్ లో నానితో, సాయి పల్లవి గొడవ పడిందని దిల్ రాజు వారికి సర్ది చెప్పబట్టే సాయి పల్లవి ప్రమోషన్స్ కి వచ్చిందనే టాక్ కూడా నడిచింది. అలాగే ఈ విషయంపైనే సాయి పల్లవి అలిగి దిల్ రాజు 'శ్రీనివాస కల్యాణానికి' నో చెప్పింది అని కూడా అన్నారు.
ఇక తమిళనాట విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన కణం సినిమా సెట్స్ లో సాయి పల్లవి బిహేవియర్ నచ్చక నాగ శౌర్య 'కణం' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. అలాగే నాగ శౌర్య బాహాటంగానే సాయి పల్లవిపై సంచలన కామెంట్స్ చేశాడు. అలాగే సూర్య సినిమా విషయంలోనూ సాయి పల్లవి వలన దర్శకుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడనే టాక్ నడవగా.. ఆ విషయమై పెద్దగా క్లారిటీ లేదు. ఇక తాజాగా సాయి పల్లవి మీద మరో న్యూస్ టాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే.. శర్వానంద్ తో కలిసి నటిస్తున్న 'పడి పడి లేచె మనసు' షూటింగ్ స్పాట్ లో సాయి పల్లవి బిహేవియర్ తేడాగా ఉందని అంటున్నారు కొందరు.
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పడి పడి లేచె మనసు' సినిమా సెట్స్ లో హీరో శర్వానంద్ కి సాయి పల్లవికి ఏదో గొడవైందని... తన సీన్ పూర్తి కాగానే సాయి పల్లవి యూనిట్ కి దూరంగా ఉంటూ పుస్తకం చదువుతూ లేదా మ్యూజిక్ వింటూ షాట్ రెడీ అయినప్పుడు మాత్రమే వచ్చి నటించి వెళ్ళిపోతోందట. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో క్లారిటీ లేదుగాని ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వీర లెవల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి సాయి పల్లవి మీద గతంలో వచ్చిన న్యూస్ ని బట్టి చూస్తే ఈ న్యూస్ కూడా నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఇక సాయి పల్లవి ఒక్క ఫిదా విషయంలోనే ఎటువంటి కాంట్రవర్సీలను టచ్ చెయ్యకుండా బుద్దిగా షూటింగ్ చేసింది. ఇక ఆమె నటించిన మిగతా సినిమాల విషయంలో ఇలాంటి ఏవేవో న్యూస్ లు బాగానే స్ప్రెడ్ అయ్యాయి.