Advertisement
Google Ads BL

తారక రామ్ డైనమిక్‌ పర్సన్‌: భరత్ రామ్!


తెలుగులో వివాదరహితునిగా, రాజకీయంగా తటస్థంగా ఉండే స్టార్స్‌లో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఒకరు. ఈయన కేవలం తన బావ గల్లాజయదేవ్‌ గురించి మాత్రమే మాట్లాడుతాడు తప్ప ఇతర ఏ రాజకీయ విషయాలను, రాజకీయ నాయకుల గురించి మాట్లాడడు. అలాంటి మహేష్‌ 'భరత్‌ అనే నేను' చిత్రాన్ని తెలంగాణ ఐటి మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ స్వయంగా సినిమా చూసి ఆ చిత్రం కోసం మీడియాకు కావాల్సినంత ప్రమోషన్‌ ఇవ్వడమే కాదు.. ఓ చర్చావేదికలో కూడా పాల్గొని ఆ చిత్రాన్ని ప్రమోషన్‌ చేశాడు. రాజకీయంగా మంచి చిత్రం సందేశాత్మకంగా ఉండటంతో కేటీఆర్‌ అంతగా ఆ చిత్రం చూసి ప్రభావితుడయ్యాడని చెప్పవచ్చు. బహుశా అప్పటినుంచే కేటీఆర్‌కి, మహేష్‌బాబుకి మంచి బాండింగ్‌ ఏర్పడింది. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే నిన్న కేటీఆర్‌ జన్మదినం. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఆయనకు విషెష్‌ని అందజేశారు. సోషల్‌మీడియాలో కేటీఆర్‌కి అభినందనలు వెల్లువెత్తాయి. మహేష్‌బాబు ట్విట్టర్‌ ద్వారా కేటీఆర్‌కి బర్త్‌డే విషెష్‌ని తెలిపాడు. మంచి స్నేహితుడు, గొప్ప లీడర్‌, డైనమిక్‌ పర్సన్‌.. కేటీఆర్‌కి జన్మదినశుభాకాంక్షలు అని తెలుపుతూ, తాను కేటీఆర్‌కి బోకే ఇస్తున్న ఫొటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు మహేష్. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. అనంతరం కేటీఆర్‌ కూడా మహేష్ కి ధన్యవాదాలు తెలిపాడు. 

Mahesh Babu Birthday wishes to KTR:

Incredible leader.. Super star mahesh babu wishes to Minister KTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs