నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే వెబ్‌సిరీస్‌లో నవాజుద్దీన్ సిద్దిఖీ, రాజశ్రీ దేశ్ పాండేలు కలిసి నటిస్తున్నారు. ఈ సిరీస్ పేరు 'శాక్రెడ్ గేమ్స్'. దానిలో నవాజుద్దీన్, రాజశ్రీదేశ్‌పాండేల మధ్య పలు సెక్స్ సీన్స్‌ఉన్నాయి. దాంతో పాండేపై విమర్శలు వస్తున్నాయి. ఓ పోర్న్‌స్టార్‌లాగా నటించారు. చెయ్యనని చెప్పలేకపోయారా? లేక విలువల కన్నా డబ్బే ముఖ్యమనుకున్నారా? అని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. నిజానికి సినిమాలలో అవసరం లేని ఐటం సాంగ్స్‌ని పెట్టి ఎక్స్‌పోజింగ్ చేయించే బదులు సన్నివేశపరంగా అవసరమైతే సెక్స్ సీన్లను చూపించడం మేలనే వారు కూడా ఉన్నారు.
ఇక సెన్సార్ ఉన్న సినిమాలలోనే ఇలాంటివి ఉన్నప్పుడు వెబ్‌సిరీస్‌లలో ఇలా ఉండటం పెద్ద విశేషం ఏమి కాదు. కాగా దీనిపై దేశ్ పాండే ఘాటుగా స్పందించింది. డబ్బు సంగతి పక్కన పెట్టండి. అది ఎప్పటికీ అవసరమే. చేయలేనని చెప్పలేకపోయారా? అంటున్నారు. అంటే కథలో ఉన్న దానిని చేయనని చెప్పాలా? నవల దీనికి ఆధారం. విక్రమ్ చంద్ర ఈ నవలను అద్భుతంగా రాశారు. వరుణ్ గ్రోవర్ సందర్భానుసారంగా అదిరిపోయే డైలాగ్స్ అందించాడు. అనురాగ్ కస్యప్ అద్భుతంగా డైరెక్షన్ చేస్తున్నాడు. మరి థీమ్‌ని బట్టి ఇందులో కొన్ని పడకగది సన్నివేశాలు ఉన్నాయి. ఐటమ్ సాంగ్స్‌లా రెచ్చగొట్టే అనవసరమైన సీన్స్ కావు అవి. కథ డిమాండ్ చేసినప్పుడు నవాజుద్దీన్‌కి భార్యగా నటించాలే గానీ రాజశ్రీ దేశ్ పాండేలా కనిపించకూడదు కదా...!
ఇక డబ్బు అంటారా? నా జీవితంలో ఓ గోల్ ఉంది. దానికోసమే కష్టపడుతున్నాను. గ్రామాలలో స్కూళ్లు, మరుగుదొడ్లు కట్టించాలని ఆశిస్తున్నాను. అందుకే డబ్బు కూడా నాకు అవసరమే. నా లక్ష్యాన్ని నేను ఖచ్చితంగా పూర్తి చేసి గ్రామాలలో స్కూళ్లు, మరుగుదొడ్లు కట్టిస్తానని ఘాటుగా సమాధానం ఇచ్చింది రాజశ్రీ దేశ్ పాండే.