Advertisement
Google Ads BL

ఈ సినిమాకి రిపేర్లు చేస్తున్నారంట..!!


శర్వానంద్ 'మహానుభావుడు' సినిమా తర్వాత హిట్ డైరెక్టర్ కి అవకాశం ఇస్తాడనుకుంటే... 'లై' సినిమాతో డిజాస్టర్ ఇచ్చిన హను రాఘవపూడికి అవకాశం ఇచ్చాడు. హను రాఘవపూడి కూడా మంచి స్టోరీ లైన్ తో శర్వానంద్ ని పడేశాడు. ఇక శర్వానంద్ - హను కాంబోలో సాయి పల్లవి హీరోయిన్ గా 'పడి పడి లేచె మనసు' సినిమా పట్టాలెక్కడమే కాదు.. షూటింగ్ కూడా శరవేగంగానే జరుపుకుంటుంది. దేశభక్తి నేపథ్యంలో మిళితమైన ప్రేమకథ గా ఈ సినిమాని హను రాఘవపూడి తీర్చిదిద్దుతున్నాడు. అయితే ఈ సినిమా పోస్టర్స్ లో సాయి పల్లవి, శర్వానంద్ ల కెమిస్ట్రీ చూశాక సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. అయితే అంచనాలు భారీగా వున్నా ఈ సినిమాకి సంబందించిన విషయాలు మాత్రం బయటికి రావడం లేదు.

Advertisement
CJ Advs

ఇదే అదునుగా హను రాఘవపూడి 'పడి పడి లేచె మనసు' సినిమాకి రీ షూట్ చేస్తున్నాడని.. గతనెలలో వచ్చిన 'తేజ్ ఐ లవ్ యు' సినిమాలోని స్టోరీ లైన్ కి 'పడి పడి లేచె మనసు' స్టోరీ లైన్ కి దగ్గర సంబంధం ఉందని.. అసలు ఆ సినిమాలోని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కి మెమొరీ లాస్ ఉన్నట్టుగానే... 'పడి పడి లేచె మనసు' సినిమాలో హీరో శర్వానంద్ కి మెమొరీ లాస్ ఉంటుందట. మరి రెండు సినిమాల కథలకు దగ్గర పోలిక ఉండడంతోనే దర్శకుడు హను రాఘవపూడి 'పడి పడి లేచె మనసు'కు రిపేర్లు చేస్తున్నాడనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇక 'తేజ్ ఐ లవ్ యు' కథ ప్రేక్షకులను ఆకట్టుకోలేక విఫలమవడంతో.. హను తన సినిమాలో కొత్తగా మార్పులు చేర్పులు చేస్తున్నాడట.

సినిమా మీద కాన్ఫిడెన్స్ వస్తేనే హను మళ్ళీ సెట్స్ పైకి వెళతారట.  మరి సినిమా విషయంలో ఎలాంటి న్యూస్ బయటికి పొక్కకుండా చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. మరి ఎంతగా జాగ్రత్త పడినా ఇలాంటి విషయాలు అంటే ఇలాంటి ఆసక్తికర వార్తలు నిమిషాల్లో మీడియాలో పాకిపోతాయి. మరి ఈ న్యూస్ మీద హను అండ్ శర్వాల స్పందనేమిటో...!

Why Delay In Padi Padi Leche Manasu?:

Padi Padi Leche Manasu Undergoing Changes
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs