Advertisement
Google Ads BL

మామ ఆ గిఫ్ట్ ఇచ్చాడంటూ సామ్ మురిసిపోతోంది!


పెళ్లయిన హీరోయిన్లు కూడా రాణించగలరని నేటి జనరేషన్‌ హీరోయిన్లలలో అక్కినేని కోడలు సమంత నిరూపిస్తోంది. ఈమె వివాహం జరిగిన తర్వాత వచ్చిన 'రాజుగారి గది2, రంగస్థలం, మహానటి, అభిమన్యుడు' ఇలా ఈమె వరుస విజయాలతో దూసుకుని పోతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కన్నడ బ్లాక్‌బస్టర్‌ 'యూటర్న్‌'కి రీమేక్‌లో నటిస్తోంది. ఇదే కాక ఆమె విశాల్‌తో మరో చిత్రం, విజయ్‌సేతుపతి, శివ కార్తికేయన్‌.. ఇలా వరుస చిత్రాలతో బిజీగా ఉంది. 

Advertisement
CJ Advs

ఇక ఈమె 'యూటర్న్‌' గురించి మాట్లాడుతూ, ఇందులో నేను రచన అనే జర్నలిస్ట్‌గా నటిస్తున్నాను. ముక్కుపుడకతో కనిపిస్తాను. అలాగని నిజంగా ముక్కు కుట్టించుకోలేదు. కన్నడ ఒరిజినల్‌ దర్శకుడు పవన్‌కుమార్‌లోని ప్రతిభ చూసే ఇందులో నటించేందుకు ఓకే చేశాను. తెలుగు, తమిళ భాషల్లో నా పాత్రకి నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను. ఈ మూవీలో ఆది పినిశెట్టి పోలీస్‌ ఆఫీసర్‌గా, రాహుల్‌ రవీంద్రన్‌ జర్నలిస్ట్‌గా కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.. అని చెప్పుకొచ్చింది. 

ఈ సందర్భంగా ఓ అభిమాని ఆమెని నాగార్జున మీకు ఇచ్చిన మంచి బహుమతి ఏమిటి? అని ప్రశ్నిస్తే... 'నాగచైతన్యని నాకు భర్తగా ఇవ్వడం, మా పెళ్లికి ఆయన అంగీకరించడమే నాకు మా మామయ్య ఇచ్చిన పెద్ద బహుమతి' అని చెప్పుకొచ్చింది. ఇక సమంత రాబోయే కాలంలో కూడా తన హవా చూపిస్తుందని, తన భర్త నాగచైతన్యతో కూడా నటించి అందరికీ సంతోష పరుస్తుందని ఆశిద్దాం.

Samantha Happy with Nagarjuna's Gift:

Samantha About Nag Gift
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs