Advertisement
Google Ads BL

వాళ్ళ ఎఫైర్ గురించి మీకేం తెలుసో.. నాకూ అంతే!


బాలీవుడ్‌లో లవర్‌బోయ్‌గా పేరు తెచ్చుకున్న వెటరన్‌ స్టార్‌ రిషికపూర్‌. బాలీవుడ్‌లోని అందరి కంటే ఈయన మహాకోపిష్టి. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన తనయుడు రణబీర్‌కపూర్‌ బాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగుతున్నాడు. ఇటీవల చేసిన 'సంజు' చిత్రం ద్వారా కూడా తానేమిటో మరోసారి నిరూపించాడు. ఈయన వయసు 35 ఏళ్లయినా ఇంకా వివాహం చేసుకోలేదు. కానీ ఆయనకు దీపికాపడుకోనే, కత్రినాకైఫ్‌, తాజాగా అలియాభట్‌ వంటి వారితో ఎఫైర్లు ఉన్నాయని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన కూడా వాటిని పెద్దగా ఖండించడం లేదు. ఇలా రణబీర్‌కి బాలీవుడ్‌లో ప్లేబాయ్‌ ఇమేజ్‌ ఉంది. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే తాజాగా రణబీర్‌ గురించి, ఆయన పెళ్లి గురించి తండ్రి రిషికపూర్‌ స్పందించాడు. రణబీర్‌ వీలైనంత త్వరగా పెళ్లి పీటలు ఎక్కాలనేది నా కోరిక. మనవలు, మనవరాళ్లతో ఆడుకోవాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాను. నేను 27ఏళ్ల వయసులోనే వివాహం చేసుకుని జీవితంలో స్ధిరపడ్డాను. కానీ రణబీర్‌కి 35ఏళ్లు వచ్చినా వివాహం చేసుకోలేదు. ఇక అలియాభట్‌ గురించి మీకు తెలిసినంతే నాకు కూడా తెలుసు. ఈ విషయం అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

ఇక రణబీర్‌ సమస్యను కూడా నేను అర్దం చేసుకోగలను. సినీనటులకు సినిమాలే తప్ప వేరే లోకం తెలియదు. కాబట్టి వారికి తగ్గ జోడీని ఎంచుకోవడం కష్టమే. వారిని అర్ధం చేసుకునే వారినే చేసుకోవాలి. ఇక నేను ఈ విషయం ఎప్పుడు రణబీర్‌కి చెప్పలేదు. కానీ నా భార్య మాత్రం పెళ్లి విషయం గురించి రణబీర్‌ని అడుగుతూ ఉంటుంది. ఇక సోషల్‌ మీడియాలో అలియాభట్‌, రణబీర్‌ తల్లి నీతూ కపూర్‌ వీలు చిక్కినప్పుడల్లా ఒకరిని ఒకరు పొగుడుకుంటూ ఉంటారు. ఇలా చూసుకుంటే రణబీర్‌, అలియా వివాహానికి కుటుంబపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని, వారు త్వరలో ఒకటి అవ్వడం ఖాయమని బాలీవుడ్‌ మీడియా అంటోంది. ప్రస్తుతం వారిద్దరు 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో నటిస్తున్నారు. 

Rishi Kapoor About and Ranbir and Alia Relation:

It is high time he got married: Rishi Kapoor on Ranbir Kapoor’s marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs