Advertisement
Google Ads BL

అన్నాచెల్లెళ్లకు కూడా ఎఫైర్‌ అంటగడతారు!


గత కొంత కాలంగా యూట్యూబ్‌లో అవాస్తవాలు, ఏవేవో ఊహాజనితమైన వార్తలు, ముఖ్యంగా లోపల విషయం లేకున్నా.. ఏదో ఉందని అర్ధం వచ్చేలా హెడ్డింగ్‌లు పెట్టడం సహజమైపోయింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ఇక తాజాగా యూట్యూబ్‌ చానెళ్ల తీరును నటి ప్రియాంకా కూడా తప్పుపడుతూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. తమ రేటింగ్స్‌, వ్యూస్‌ కోసం యూట్యూబ్‌లో ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నాయి. 

Advertisement
CJ Advs

డబ్బుల కోసం, రేటింగ్స్‌ కోసం అక్కాతమ్ముళ్లకు కూడా లింక్‌ పెట్టడానికి వారు వెనుకాడటం లేదు. నిజాయితీగా పనిచేసే వారిని డిస్బర్బ్‌ చేయవద్దు. చాలా కోపంగా, ఇరిటేట్‌గా ఉన్నాను. యూట్యూబ్‌ చానెల్స్‌ మరో పని పాటా లేదా? మీవ్యూస్‌, డబ్బుల కోసం బతికున్నవారిని కూడా చంపేస్తున్నారు... అని ఘాటుగా వీడియో పోస్ట్‌ చేసింది. తమిళ బుల్లితెర నటి ప్రియాంకా ఆత్మహత్య చేసుకుంటే యూట్యూబ్‌ చానెల్స్‌ మాత్రం ఈమె మరణించిందని వార్తలను పోస్ట్‌ చేయడంతో ఈమెకి విపరీతమైన ఆగ్రహం కలిగింది. మీరు నామీద పెట్టిన వీడియో డిలేట్‌ చేయండి. లేకపోతే ఆ వీడియో ఎవరు పెట్టారో వారిని మరోవిధంగా చేయాల్సి ఉంటుంది. 

నేను చనిపోయానని మీరు పెట్టిన వార్త విని మా కుటుంబ సభ్యులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఏదైనా చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయండి. మీకు దీని వల్ల వ్యూస్‌ రావచ్చు కానీ మా కుటుంబాలలో వారికి సర్దిచెప్పడానికి, ఆయా వార్తలను ఖండించడానికి తల ప్రాణం తోకకి వస్తోంది. ఇలాంటి ఫేక్‌ న్యూస్‌లు రాకుండా చూసుకోమని ఆమె తీవ్రంగా స్పందించింది. 

Priyanka Fires on Media:

TV Actress Priyanka fires on Social Media and Youtube Channels
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs