Advertisement
Google Ads BL

ఎనిమిదో తరగతిలోనే లవ్‌ ప్రపోజల్‌: హీరోయిన్!


పదేళ్లకింద హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన పూనమ్‌కౌర్‌ తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది. అయితే ఆమె అందం, టాలెంట్‌ ఉన్నప్పటికీ స్టార్‌ హీరోయిన్‌ కాలేకపోయింది. ఈమె అసలు పేరు జగ్‌జీత్‌కౌర్‌. ఈ మిస్‌ ఆంధ్రా సినిమాలలో కంటే వివాదాస్పద విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. తాజాగా బుల్లితెర ఎంట్రీ కూడా ఇచ్చింది. తాజాగా జగ్‌జీత్‌కౌర్‌ అలియస్‌ పూనమ్‌కౌర్‌ మాట్లాడుతూ, నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. స్కూల్‌, కాలేజీ అంతా ఇక్కడే. హైటెక్‌ సిటీ, చార్మినార్‌, ట్యాంక్‌బండ్‌, సాలార్‌ జంగ్‌ మ్యూజియం, చిలుకూరు బాలాజీ టెంపుల్‌ వంటివి ఎంతో ఇష్టం. స్కూల్‌లో అల్లరి చేయడంలో, కాలేజీలో ర్యాగింగ్‌ చేయడంలో మనమే ఫస్ట్‌. 

Advertisement
CJ Advs

అమ్మ 'అత్తా'అని, అన్నయ్య 'బచీ, చోటీ' అంటూ ముద్దుగా పిలిచేవారు. స్నేహితులు మాత్రం 'పీకే' (పూనమ్‌కౌర్‌)అని అనేవారు. అమీర్‌పేటలోని విద్యోదయస్కూల్‌లో చదువుకున్నాను. నేను 8వ తరగతి చదువుతుండగా నా స్నేహితులు నిన్ను చాలా మంది లవ్‌ చేస్తున్నారే అని చెప్పేవారు. దాంతో తమాషాగా ఒకరోజు లవ్‌ చేస్తుంటే నాకు చెప్పాలి గానీ మీకు చెబితే ఏం లాభం అని అన్నాను. దాంతో ఓ స్టూడెంట్‌ ఇంటర్వెల్‌ సమయంలో వచ్చి మోకాలిపై కూర్చుని ఐలవ్‌యు అని రోజ్‌ ఫ్లవర్‌, లవ్‌లెటర్‌ ఇచ్చి 'ఐలవ్యూయు పూనమ్‌'అని ప్రపోజ్‌ చేశాడు. నేను నవ్వుకుంటూ లెటర్‌, ఫ్లవర్‌ తీసుకున్నాను. నాకు వచ్చిన ప్రపోజల్స్‌లో ఇదే స్వీట్‌ ఇప్పటికి. చదువులో యావరేజ్‌ స్టూడెంట్‌ని, మాథ్స్‌ అంటే భయం. 

విల్లా మేరీ కాలేజీలో మొదట ఎంపీసీ తీసుకుని, తర్వాత భయపడి సిఈసీకి మారాను. కాలేజీకి బంక్‌ కొట్టి స్నేహితులతో సినిమాలు చూసేవాళ్లం. ఖాళీ సమయాల్లో పుస్తకాలు బాగా చదువుతాను. నాకు నచ్చిన బుక్‌ 'సోల్‌పవర్‌' అని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈమె ఎనిమిదో తరగతిలోనే లవ్‌ ప్రపోజల్‌ అందుకున్న స్వీట్‌ మెమరీని బాగానే గుర్తుపెట్టుకుంది. 

Poonam Kaur Talks About Her Personal Life:

Poonam Kaur Revealed Her First Love
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs