Advertisement
Google Ads BL

ఒక్క సినిమాకే చిరు.. అంత నచ్చాడా..!


సాధారణంగా ఒక్కొక్కరిని మనం చూసే కోణంలో మార్పు ఉంటుంది. పది మంది ఉంటే పది మందికి ఆ వ్యక్తి పది రకాలుగా కనిపిస్తాడు. అందరి దృష్టి, ఆలోచనా విధానం ఒకే రకంగా ఉండదు. ఇక విషయానికి వస్తే మెగాస్టార్‌ చిరంజీవికి తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఫ్యాన్స్‌, క్రేజ్‌, ఇమేజ్‌ వంటివి మరోకరకి లేవనే చెప్పాలి. ఇక ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గొప్పడ్యాన్సర్‌, గ్రేట్‌ యాక్టర్‌, మోస్ట్‌ పాపులర్‌ యాక్షన్‌ హీరో, ఫైట్స్‌ని, సాంగ్స్‌లో స్టెప్పులను ఇరగదీస్తాడని ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ చిరంజీవిలో రొమాంటిక్‌ కోణం కూడా ఎంతో ఉంది. ఈయన చిత్రాలలో టీజింగ్‌, హీరోయిన్లతో ఆయన చేసే రొమాన్స్‌సీన్స్‌ వంటివి ఆయనలోని మరోకోణాన్ని కూడా పట్టిస్తాయి. 

Advertisement
CJ Advs

ముఖ్యంగా అత్త, మరదళ్లు ఇద్దరినీ ఆటపట్టించే 'అత్తకుయముడు - అమ్మాయికి మొగుడు, అల్లుడా... మజాకా'తో పాటు 'ఘరానా మొగుడు, దొంగ మొగుడు' వంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కానీ చిరంజీవి పూర్తి రొమాంటిక్‌గా, ప్రేమకథా చిత్రాలు చేసినవి మాత్రం వేళ్ల మీద లెక్కించవచ్చు. దాంతో ఆయనతో పనిచేసిన హీరోయిన్లు ఆయన గొప్పయాక్టర్‌. గుడ్‌ కోఆర్టిస్టు, మనసున్న మనిషి వంటివి చెప్పేవారే గానీ వెరీ రొమాంటిక్‌ అని చెప్పిన సందర్భాలు తక్కువ. కానీ తాజాగా చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీనెంబర్‌ 150'లో ఆయన సరసన నటించిన కాజల్‌ మాత్రం తాను చూసిన వారిలో మోస్ట్‌ రొమాంటిక్‌ పర్సన్‌ చిరు అని తెలిపింది. అంటే పదేళ్ల విరామం తర్వాత కూడా అదే గ్రేస్‌, షష్టిపూర్తి పూర్తి చేసుకున్న చిరంజీవి గురించి ఆమె అలా అనడం విశేషం. 

ఇక కాజల్‌ విషయానికి వస్తే ఆమె తెలుగులోనే కాదు.. తమిళంలో కూడా టాప్‌స్టార్స్‌ ఎందరితోనో నటించింది. కానీ ఆమెకి నచ్చిన రొమాంటిక్‌ పర్సన్‌ మాత్రం చిరునేనట. ఈ పొడగ్త చిరు విషయంలో చాలా రేర్‌గా వస్తుంది కాబట్టి.. ప్రస్తుతం కాజల్‌ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.

Kajal Agarwal Praises Megastar Chiranjeevi:

Kajal Agarwal About Megastar Chiru
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs