Advertisement
Google Ads BL

అభయ్‌ గురించి ఎన్టీఆర్ చాలా చెప్పాడు!


ఒకవైపు సినిమాలు.. మరోవైపు కుటుంబ బాధ్యతలు, కొత్త చిత్రాలకు కథలు వింటూ సరైన కథలని జడ్జ్‌ చేయడం, నిరంతరాయంగా షూటింగ్‌.. ఒక సినిమా తర్వాత మరో చిత్రం.. ప్రమోషన్లు ఇలా స్టార్‌ హీరోలు ఏడాదికి చేసేది ఒకటి రెండు చిత్రాలే అయినా ఏడాదంతా బిజీబిజీగానే ఉంటారు. ఇక రామ్‌చరణ్‌ విషయానికి వస్తే ఆయనకు కథల ఎంపికలో మెగా ఫ్యామిలీలోని ఎందరో సహాయం చేస్తారు. ఆయన శ్రీమతి ఉపాసన కూడా తన వంతు కృషి చేస్తుంది. 

Advertisement
CJ Advs

మరోవైపు మహేష్‌కి కూడా ఆయన తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణ, మహేష్‌ భార్య నమ్రతా శిరోద్కర్‌ల సాయం ఉంటుంది. ఆ విషయంలో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌కి కథల పరంగా, ఇతరత్రా సాయం చేసే వారు లేరనే చెప్పాలి. ఆయన భార్య లక్ష్మీప్రణతి కూడా పెద్దగా ఆ విషయాలను పట్టించుకుంటుందా? అనే విషయంలో ఇప్పటి వరకు ఏ న్యూస్‌ రాలేదు. కాబట్టి మొత్తం యంగ్‌టైగర్‌ చూసుకోవాలి. ఇక ఇంతటి బిజీలో ఉండి కూడా ఎన్టీఆర్‌ తన పెద్దకుమారుడు అభయ్‌రామ్‌ జన్మదినోత్సవాన్ని బాగా సెలబ్రేట్‌ చేశాడు. 

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ, చేసే ప్రతి అల్లరి పనిలో మా ఇద్దరికీ వాటి ఉంటుంది. మేమిద్దం ఎప్పుడు ఒకే జట్టుగా ఉంటాం. నాతో పాటు అల్లరి చేసే నా పార్ట్‌నర్‌ బర్త్‌డే ఇవాళ. అంటూ తన కుమారుడితో తీసుకున్న ఫొటోని ఆయన పోస్ట్‌ చేశాడు. పార్ట్‌నర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజుతో వీడికి నాలుగేళ్లు నిండుతాయి. అభయ్‌కి శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు అంటూ ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. మరోవైపు ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో చేస్తున్న 'అరవింద సమేత వీరరాఘవ' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Jr NTR Talks About His son Abhay Ram:

Jr NTR Special Greetings to Abhay Ram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs