'అర్జున్ రెడ్డి' సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ కి టర్నింగ్ పాయింట్. రెండో సినిమాతో పది సినిమాల అనుభవాన్ని సంపాదించిన విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'గీత గోవిందం' గీత ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మాతగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా టీజర్ ని కొద్ది క్షణాల ముందే విడుదల చేసింది చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన 'గీత గోవిందం' పోస్టర్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. హీరోయిన్ రష్మిక తో విజయ్ చేస్తున్న రొమాంటిక్ సరసం ఆ పోస్టర్స్ లో అందరిని ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన టీజర్ కూడా అదిరింది. నిజంగా చాలా డీసెంట్ గా విజయ్ చెప్పినట్టుగానే అంటే టీజర్ విడుదల చేసినట్టు ప్రకటించిన విజయ్ దేవరకొండ తన అభిమానులను ఉద్దేశించి.. రౌడీస్... నేను మారిపోయా... నేను ఇప్పుడు కంప్లీట్ గా మంచి అబ్బాయిని అన్నట్టుగానే ఉంది 'గీత గోవిందం' టీజర్.
ఇక టీజర్ లో కెళితే... విజయ్ దేవరకొండ రైతు మాదిరి లుంగీ కట్టుకుని ట్రాక్టర్ తోలుతూ రేడియాలో వస్తున్న ఎన్నోన్నో జన్మల బంధం.. నీది నాది... ఎన్నటికీ మాయని మమత.. నాది నీది... అనే పాటకు తనని, తన భార్యని ఊహించుకుంటూ.. ఆ ఊహాలో తన భార్యతో రొమాంటిక్ గా సరసమాడుతూ కల చెదిరి హీరోయిన్ రష్మికతో చెంప దెబ్బతినడమే కాదు... హీరోయిన్ రష్మిక ఇంకోక్కసారి అమ్మాయిలు... ఆంటీలు .. ఫిగర్లు అంటూ తిరిగావంటే .. యాసిడ్ పోసేస్తాను అంటూ హీరో విజయ్ కి వార్నింగ్ కూడా ఇచ్చేస్తుంది. ఇక విజయ్ దేవరకొండ చాలా డీసెంట్ గా హే భగవాన్ అంటూ భయపడుతూనే మేడం మేడం అంటూ హీరోయిన్ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ... సారీ కూడా చెప్పేస్తాడు. కానీ హీరోయిన్ మాత్రం విజయ్ ని నిలదీస్తూ ఇక మారవా నువ్వు అంటే.. దానికి విజయ్ చాలా నీట్ గా అమాయకంగా లేదు మేడం నేను మారిపోయా... ఐ యాం కంప్లిట్లీ డీసెంట్ నౌ అంటూ చెప్పే డైలాగ్స్ మాత్రం సూపర్బ్ గా ఆకట్టుకున్నాయి.
ఇక విజయ్ దేవరకొండ యంగ్ అండ్ డీసెంట్ లుక్ తో ఆకట్టుకున్నాడు. క్లాసీ లుక్ తో పాటుగా కూడా బ్లాక్ అండ్ వైట్ సీన్స్ లో అదరగొట్టాడు. ఇక రష్మిక మాత్రం రొటీన్ లుక్ తో క్యూట్ గా వుంది. లవ్ అండ్ రొమాంటిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ తో పాటుగా మ్యూజిక్ కూడా హైలెట్ అవుతుందని ఈ టీజర్ చూస్తుంటే అర్ధమవుతుంది.