Advertisement
Google Ads BL

హీరోయిన్ కు పేరొస్తుందని రాజకీయమా..?


కార్తికేయ హీరోగా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం 'ఆర్ఎక్స్ 100′. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మౌత్ టాక్ తో దూసుకుపోతుంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్రం టీం విజయయాత్రను చేపడుతోంది.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా ఈ చిత్రం యొక్క పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోరింగ్ బ్లాక్ బ్లాస్టర్ పేరుతో విడుదల చేసిన ఈ పోస్టర్ లో ఈ చిత్రంకి పని చేసిన ముఖ్యమైన టెక్నిషియన్స్ తో పాటు హీరో, డైరెక్టర్, నిర్మాత ఫొటోలు కనిపించాయి కాని హీరోయిన్ పాయల్ ఫొటో లేదు. 

దాంతో ప్రస్తుతం ఈ పోస్టర్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెలువడుతున్నాయి. ఈ చిత్రం హిట్ అవ్వటానికి మెయిన్ కారణం హీరోయిన్ అని ఒప్పుకోవాల్సిందే. కానీ అలాంటిది హీరోయిన్ ఫోటో ఆ పోస్టర్ లో లేకపోవడంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. థియేటర్స్ కు యూత్ ని రప్పించడంలో పాయల్ ది కీలక పాత్ర అని తెలిసిందే. మరి ఈ పోస్టర్ లో హీరోయిన్ ఫోటో కావాలనే పెట్టలేదా.. లేదా పొరపాటున టీమ్ మర్చిపోయిందా అన్న విషయం తెలియాల్సి వుంది.

No Heroine Photo in RX 100 Poster:

RX 100 Team Deletes Heroine Payal Photo in Poster
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs