Advertisement
Google Ads BL

'అఖిల్' కోసం నాగ్ తాపత్రయం ముచ్చటేస్తుంది!


టాలీవుడ్ లో తెరంగేట్ర మూవీ 'అఖిల్'తో భారీ డిజాస్టర్ అందుకున్న అక్కినేని అఖిల్ తర్వాత 'హలో' సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నాడు. మరి మూడో సినిమాని 'తొలిప్రేమ' హిట్ తో ఉన్న కుర్ర దర్శకుడు వెంకట్ అట్లూరితో కలిసి మొదలు పెట్టేశాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫారిన్ లో జరుగుతుంది. కాగా అఖిల్ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలోనే కాదు ఫిలింసర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైందని.. అలాగే ఈ విషయంలో అఖిల్ తండ్రి నాగార్జున బాలీవుడ్ నిర్మాతలతో చర్చలు జరిపినట్టుగా టాక్.

Advertisement
CJ Advs

ప్రస్తుతం నాగార్జున తెలుగులో హీరో నానితో కలిసి దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్యతో ఒక మల్టీస్టారర్ సినిమా చెయ్యడమే కాదు బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మాతగా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో 'బ్రహ్మాస్త్ర' అనే సినిమాలో నటిస్తున్నాడు. గతంలోనూ నాగార్జున అనేక బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. కానీ ఈమధ్య కాలం అంటే ఓ పదేళ్లుగా నాగార్జున బాలీవుడ్ వైపు చూడనే లేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి నాగార్జున బాలీవుడ్ లో బ్రహ్మాస్త్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే 'బ్రహ్మాస్త్ర' కోసం నాగ్ బల్గెరియా వెళ్ళాడు కూడా. ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మాతగా చేస్తున్న ఈ సినిమాలో నటిస్తున్న నాగార్జునతో కరణ్ మరో డీల్ కూడా కుదుర్చుకున్నాడని అంటున్నారు.

కరణ్ జోహార్ కి బాహుబలి సినిమా అప్పటినుండి తెలుగు సినిమాల మీద, హీరోల మీద ఇంట్రెస్ట్ కలిగింది. అందుకే ప్రభాస్ ని బాలీవుడ్ లో ఎంట్రీ ఇప్పిద్దామనుకుంటే.. ప్రభాస్ కరణ్ ని హోల్డ్ లో పెట్టాడు. ఇక రానా అడపాదపా బాలీవుడ్ కి వచ్చి వెళుతున్నాడు. అయితే కరణ్ జోహార్ ఇప్పుడు నాగార్జున కొడుకు అఖిల్ ని బాలీవుడ్ ఎంట్రీ ఇప్పించే ఉద్దేశ్యంతో ఉన్నాడని... అది కూడా అఖిల్ నాలుగో సినిమానే అని అంటున్నారు. మరి అఖిల్ నాలుగో సినిమాని రవిరాజా పినిశెట్టి తనయుడు సత్య ప్రభాస్ డైరెక్షన్ లో చేయబోతున్నాడనే న్యూస్ ఉండగా.. ఆ సినిమానే కరణ జోహార్ తెలుగు, తమిళం, హిందీలో నిర్మించబోతున్నాడని అంటున్నారు. మరి తెలుగులోనే సరిగ్గా సక్సెస్ అవని అఖిల్ బాలీవుడ్ కెళ్ళి ఏం చేస్తాడో అని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తుండటం విశేషం. 

Akhil Bollywood Debut With Satya Prabhas, Karan Johar Film:

Nagarjuna Plans For Akhil Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs