Advertisement
Google Ads BL

చైతూతో కలిసి సమంత మరొకటి..!


ఎంతటి వారికైనా తమ తమ పరిధిల్లో సామాజిక బాధ్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ మన రాజకీయ నాయకులు, ఇతర వ్యాపార, వాణిజ్యవేత్తలు మాత్రం ఎక్కువ శాతం సమాజంపై కాకుండా నాకేమిటి? ఏ పార్టీకి ఫండ్‌ ఇస్తే మనకేంలాభం? ఏ పార్టీకి ఓకే అంటే ఎంత నష్టం? అనే లెక్కలు లావాదేవీలలోనే ఎక్కువగా ఉంటారు. నిజానికి ఈ విషయంలో సినిమా వారు మాత్రం ఫర్వాలేదనిపిస్తారు. తమను ఇంత వారిని చేసిన ప్రజలకు ఏదైనా చేయాలనే తపన ఎక్కువగా సినిమా వారిలో కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా వారంటే అందరు వారు చేసే పనుల మీదనే దృష్టి కేంద్రీకరిస్తారు. ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా సెలబ్రిటీ ఏదైనా మంచి చేస్తే వారి అభిమానులు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతలా సినిమావారు ప్రజలనను ప్రభావితులను చేయగలరు. 

Advertisement
CJ Advs

ఇక సమాజసేవ విషయంలో పెద్దగా నాగార్జున పేరు వినిపించదు. అందరు ఆయన్ను పక్కా బిజినెస్‌మేన్‌ అని, లాభనష్టాల విషయంలో ఆచితూచి స్పందిస్తారనే విమర్శ ఉంది. ఇక విషయానికి వస్తే పెళ్లయిన తర్వాత కూడా సమంత అక్కినేని ఇంట కోడలిగా, అత్తకు తగ్గ కోడలు అని పేరు తెచ్చుకుంటోంది. తన భర్త బిజీ దృష్ట్యానో, మరో కారణం వల్లనో పెద్దగా పట్టించుకోకపోయినా సమంత మాత్రం అనాధపిల్లలు, పౌష్టికాహారం నుంచి ఎన్నో విధాలుగా సమాజానికి సేవ చేస్తోంది. 

వివాహ అనంతరం ఆమె ఎంతగా సినిమాలలో బిజీ అయినా కూడా ఆ సంపాదనలో కొంతభాగం పేదలకు కేటాయించడం హర్షణీయం. అమల బ్లూక్రాస్‌ ద్వారా సేవలు అందిస్తుంటే కోడలు మాత్రం మరో రూపంలో సాయం చేస్తోంది. ఇక ఈమె తాజాగా పలు బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా పనిచేస్తోంది. తాజాగా ఆమె తన భర్త నాగచైతన్యతో కలిసి రెక్సోనా సోప్‌కి బ్రాండ్‌ అంబిసిర్‌గా ఎంపికైంది. దీనికి సంబంధించిన చైతు, సామ్‌ ఉన్న బ్లాక్‌ అండ్‌వైట్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

Naga Chaitanya and Samantha date nights with Rexona:

Naga Chaitanya Wife Samantha's Greatness Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs