Advertisement
Google Ads BL

సమంత ఏదో మ్యాజిక్ చేస్తోంది..!


వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న అక్కినేని సమంత నటిస్తున్న తాజా చిత్రం 'యూ టర్న్' ఫస్ట్ లుక్ ఇవాళ విడుదలైంది. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటిస్తోంది. ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్ గా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా కీలకపాత్రలు పోషిస్తున్నారు. 'రంగస్థలం, అభిమన్యుడు, మహానటి' చిత్రాలతో ఘన విజయాలు సొంతం చేసుకోవడంతోపాటు.. నటిగా తన స్థాయిని పెంచుకొన్న సమంత 'యూ టర్న్' తో తన నటవిశ్వరూపం చూపనుంది. ఆమె ఇంటెన్స్ లుక్స్, సబ్టుల్ పెర్ఫార్మెన్స్ 'యూ టర్న్' చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. చిత్రీకరణ దాదాపుగా పూర్తి చేసుకొన్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ మొదలవ్వగా.. త్వరలోనే పాటల చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు. సమంత వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు. 

Advertisement
CJ Advs

తారాగణం: సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా తదితరులు.. 

సాంకేతికవర్గం: కథ-దర్శకత్వం: పవన్ కుమార్,  నిర్మాతలు; శ్రీనివాస చిట్టూరి-రాంబాబు బండారు,  నిర్మాణ సంస్థలు: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ & వివై కంబైన్స్,  సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి , ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మి,  కళ: ఏ.ఎస్.ప్రకాష్ , కూర్పు: సురేష్ అరుముగమ్,  పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్

Samantha ‘U Turn’ First Look:

The first look of Actress Samantha Akkineni from her upcoming mystery thriller ‘U Turn’ is unveiled
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs