సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా సరే తమ రంగంలో అవకాశాలు రావడమే గొప్పగా ఫీలవుతారు. ముఖ్యంగా మొదటి చాన్స్ ఇచ్చిన వారిని గాడ్‌ఫాదర్‌గా చెప్పుకుంటారు. ఇక గాయక గాయణీమణుల విషయానికి వస్తే నేడు మంచి మంచి స్థానంలో ఉన్న వారికి కూడా పాటకు 5 నుంచి 10వేలు మాత్రమే ఇస్తున్నారనేది నగ్నసత్యం. ముఖ్యంగా 'పాడుతా తీయగా'తో పాటు ఇలాంటి పలు కార్యక్రమాల ద్వారా ఎందరో కొత్త టాలెంట్ ఉండే వారు ఉన్నారు. ఎస్పీబాలు, ఏసుదాస్.. వంటి వారికి చాన్స్‌లు తగ్గడానికి వారు అన్ని పాటలను పాడటం తగ్గించుకోవడంతో పాటు వారి రెమ్యూనరేషన్ కూడా అంతే కారణం. వారిచేత ఒక పాట పాడించే వ్యయానికి ఉచితంగా పాడేందుకైనా పది మంది క్యూలలో నిలబడి ఉంటున్నారు. డబ్బు ముందు కాదు.. మొదట పేరు సంపాదిస్తే అవే డబ్బును సంపాదించి పెడతాయనే వాస్తవం. ఇక విషయానికి వస్తే ఈ ఏడాది శతదినోత్సవం జరుపుకున్న చిత్రాలలో 'రంగస్థలం'ది రేర్ రికార్డు. ఇక ఇందులోని 'రంగమ్మ.. మంగమ్మ'పాటతో పాటు 'జిల్..జిల్..జిల్ జిగేల్‌రాణి' పాట కూడా అద్భుతంగా అందరినీ అలరించింది.
ఇక ఈ జిగేల్ రాణి పాటకి వస్తే దీనిని విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి మండలం, బీఆర్టీ కాలనీలో నివసించే హరికథా కళాకారిణి గంట్ల వెంకటలక్ష్మి. కొద్దిరోజులుగా ఈమె తనకి పాట పాడినందుకు రూపాయి రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదని మీడియా ముందుకు వచ్చింది. దీంతో ఇది వార్త ప్రసార మాధ్యమాలలో హైలైట్ అయింది. అసలు ఈమధ్యన ఇలాంటి వారితో పాటు ఫలానా కథ తనది అని.. ఇలా పలు రకాలుగా కొందరు మీడియా ముందుకు వస్తున్నారు. అయితే ముందుగా సైలెంట్‌గా మీడియాకి ఎక్కి రచ్చ చేయకుండా చాంబర్‌తో పాటు పలు మార్గాల ద్వారా సమస్యను పరిష్కారం చేసుకోవాల్సి వుంది. అంతేగానీ మీడియా ముందుకు వస్తే జరిగే రచ్చ, చర్చ అందరికీ తెలిసిందే. చివరకు అందరు కలిసి వారు వారు ఒకటై మీడియా మీదకి తప్పును దోస్తారు. అసలు ఇంతకీ ఈ పాట పాడిన గంట్ల వెంకటలక్ష్మి నానా రచ్చ చేయడంతో సుకుమార్ పెద్ద మనసు చేసుకుని ఎవ్వరికి ఇవ్వనంతగా ఆమెకి లక్ష రూపాయలు పారితోషికం ఆమె బ్యాంక్ ఖాతాలో వేశాడు.
మరి ఇంతలోనే గొడవ చేయడం వల్ల బయటి వారికి సినిమా రంగంలో డబ్బులు ఇవ్వరని, ఈ చాన్స్ ఏరికోరి ఆమెని ఎంచుకుని ఇచ్చిన సుకుమార్, నిర్మాతలు, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌లపై పడిన మరకను ఆమె తుడిచేయగలదా? అలాగని రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడం ఇబ్బందే. దానిని సామరస్యంగా పరిష్కరించుకోనందువల్ల ఆమెకి, ఆమెకి చాన్స్ ఇచ్చినవారికి, మీడియాకి అందరికి చెడ్డపేరు వస్తుందనే అవగాహన లేకపోతే ఎలా...? ఇక ఈ పాట విని తనకు మూడు సినిమా అవకాశాలు వచ్చాయని ఆమె వెల్లడించింది. మరి అలాంటి మొదటి అవకాశం వచ్చిన వారిని బద్‌నాం చేయడం సరికాదు.. ముందుగా అందరి నోటీసులకు తీసుకెళ్లి చివరి ఆయుధంగానే మీడియా ముందుకు రావాలి. లేకపోతే పరిశ్రమ అంటేనే చెడ్డపేరు మరింతగా వచ్చేలా చేయకూడదు మరి...!