Advertisement
Google Ads BL

‘సంజు’లా మనోళ్లు బయోపిక్స్ తీయగలరా?


బయోపిక్‌లు అందునా బతికున్న వారి బయోపిక్‌లలో వాస్తవాలను చూపించాలంటే ఎంతో గట్స్‌ కావాలి. ఏమాత్రం తేడా వచ్చినా న్యాయపరంగా, చట్టపరంగానే కాదు.. ఆయా వ్యక్తుల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఎక్కువగా తెలుగులో బయోపిక్‌లు రావు. వచ్చినా ఒక కోణంలోనే వాటిని చూపించే ప్రయత్నం చేస్తారు తప్ప వివాదాస్పద అంశాలను కూడా బోల్డ్‌గా చూపించడానికి ముందుకు రారు. ఇక పలువురు తమ బయోపిక్‌లతో కూడిన ఆటోబయోగ్రఫీలు, సినిమాల కోసం తమ జీవిత విశేషాలను చెప్పేటప్పుడు అనేక వివాదాస్పద అంశాలను ప్రస్తావించరు. అలా ఎన్నో నిజాలు భూగర్బంలో కలిసి పోతూ ఉంటాయి. అవి తెలిసినా కూడా ఆయా కుటుంబ సభ్యులు, వారి అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని భావిస్తారు. ఇక రాబోయే 'ఎన్టీఆర్‌'బయోపిక్‌ నుంచి వైఎస్‌ పాదయాత్ర నేపధ్యంలో తీస్తున్న 'యాత్ర' బయోపిక్‌ వరకు వన్‌ సైడెడ్‌గానే ఉంటాయని ఎవరైనా ఈజీగానే ఊహిస్తారు. ఎన్టీఆర్‌ రెండో వివాహం వంటి పలు విషయాలను ఆ బయోపిక్‌లో చూపించే అవకాశం లేదని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. 

Advertisement
CJ Advs

కానీ ఈ విషయంలో సంజు అలియాస్‌ సంజయ్‌దత్‌ మాత్రం మగాడ్రా బుజ్జీ అనిపించుకున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ, నా జీవితంలో జరిగిన నాకు గుర్తున్న ప్రతి విషయాన్ని నేను హిరాణికి దాపరికం లేకుండా చెప్పాను. అందులోంచి ఏ పాయింట్‌ తీసుకోవాలి? ఎలా చిత్రీకరించాలి? అనే విషయాలన్నింటిలో నేను జోక్యం చేసుకోకుండా ఆయనకే వదిలేశాను. ఓ చిన్న తుపాకీ నా జీవితాన్ని నాశనం చేసింది. ఇక ఈయన బయోపిక్‌గా వచ్చిన 'సంజు' చిత్రం ఇంతలా ఆదరణ పొందడానికి ఇదే కారణం. తల్లిదండ్రులతో తనకున్న సంబంధాలు, ఇతర మహిళలతో ఉన్న అక్రమ సంబంధాలు, డ్రగ్స్‌కి బాసిసకావడం ఇవ్వన్నీ ఉన్నది ఉన్నట్లుగా ఆయన వివరించాడట. 

ఇక తాజాగా సంజయ్‌దత్‌ మాట్లాడుతూ, ఓ చిన్న తుపాకి నా జీవితాన్ని నాశనం చేసింది. నేనేమీ ఉగ్రవాదిని కాదు. ఆయుదచట్టం ప్రకారం శిక్ష అనుభవించాను. నేనేమీ పారిపోలేదు. మగాడిలా వచ్చి అరెస్ట్‌ అయ్యాను. తుపాకీని ఇంట్లో పెట్టుకోవడం ద్వారా భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాను. ముంబై పేలుళ్లు, బాబ్రీ మసీద్‌ విధ్వంసం సమయంలో నాకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నందు వల్ల ఓ తుపాకిని నాకు రక్షణకు, కుటుంబానికి రక్షణగా పెట్టుకున్నాను. అది ఇంత పనిచేస్తుందని అనుకోలేదు. ఈ రోజు ఈ సినిమా ఇంతలా ఆదరణ పొందుతోందంటే నా నిజాయితీ కూడా ఒక కారణమని చెప్పుకొచ్చాడు. 

నిజానికి ముంబై మాఫియానే కాదు బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌లో కూడా ఎందరో అక్రమాయుధాలను కలిగి ఉన్నారు. అందునా సంయ్‌దత్‌కి బాల్‌థాక్రే, కాంగ్రెస్‌ పార్టీ వంటివన్నీ మద్దుతు ప్రకటించాయి. నాడు కాంగ్రెస్‌లో ఆయన తండ్రి సునీల్‌దత్‌కి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదే ఆయన తన అధికారం ఉపయోగించి ఉంటే సంజయ్‌ బయట పడి ఉండేవాడు. ఇంట్లోనే తన శత్రువులపై కాల్పులు జరిగిన ఘనులు కూడా బయట తిరుగుతుంటే సంజు జీవితం ఇలా కావడం ఎంతో బాధాకరమనే చెప్పాలి.

Sanjay Dutt About Sanju Biopic:

Sanjay Dutt reveals how a gun Destroyed his life
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs