Advertisement
Google Ads BL

హిట్టుంటేనే అనే దానికి ఇదే నిదర్శనం..!


టాలీవుడ్ లో కొంతమంది దర్శకులు ఒక స్టేజ్ కి వచ్చేశాక అంటే హిట్ దర్శకుడిగా ముద్రపడిన తర్వాత ఆ దర్శకుడు ఏం చెబితే అదే సినిమా సెట్స్ లో చెల్లుతుంది. ఇంక్లూడింగ్ నిర్మాత కూడా దర్శకుడు మాట జవదాటడు. అలాంటి వాళ్లలో రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ వంటి టాప్ మోస్ట్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇక ఒక హిట్ దర్శకుడికి వరసగా రెండు సినిమాలు ఫెయిల్ అయ్యాయి అంటే అప్పుడు దర్శకుడు.. నిర్మాత, హీరోలు చెప్పినట్లే వినాలి. ఇదంతా సినిమా ఇండస్ట్రీలో కామన్ పాయింట్. రాజమౌళి లాంటి వాళ్ళు అడిగిందల్లా పెట్టడానికి.. అంతకు మించి పెట్టడానికి నిర్మాతలసలు వెనుకాడరు. కానీ ప్లాప్ లో ఉన్న దర్శకుడు చెప్పినట్టు పెట్టమన్నట్టు బడ్జెట్ పెట్టేటప్పుడు అనేక విధాలుగా ఆలోచిస్తారు నిర్మాతలు.

Advertisement
CJ Advs

తాజాగా ఇప్పుడు ఇలాంటి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. వరస వైఫల్యాలతో... హీరోలంతా మొహం చాటేసినా తన మొదటి హీరో తనని పిలిచి మళ్ళీ సినిమా అవకాశం ఇచ్చిన శ్రీను వైట్ల విషయంలో ఇప్పుడు పైన చెప్పిందే జరుగుతుంది. విషయం ఏమిటంటే శ్రీను వైట్ల - రవితేజ కాంబోలో వస్తున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమా విదేశాల్లోనే షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఎప్పుడూ బడా నిర్మాణ సంస్థలతో పనిచేసే శ్రీను వైట్ల ఈ సినిమాని మైత్రి మూవీస్ వారికీ చేస్తున్నాడు. అయితే వరస వైఫల్యాలతో ఉన్నప్పటికీ.. ఎప్పటిలాగే శ్రీను వైట్ల.. రవితేజ సినిమాకి నిర్మాతలతో లెక్కకు మించి ఖర్చు పెట్టిస్తున్నాడట.

మరి అటు దర్శకుడు ప్లాప్స్ లో ఉండి.. ఇటు హీరో రవితేజ ప్లాప్స్ లో ఉండేసరికి మైత్రి మూవీస్ వారు కాస్త కంగారు పడి అమర్ అక్బర్ ఆంటోని బడ్జెట్ ని మితిమీరకుండా... కాస్ట్‌ కటింగ్‌ పేరుతొ ఫారిన్ లో జరగాల్సిన షూటింగ్ ని క్యాన్సిల్ చేసేసి ఇక్కడ హైదరాబాద్ లోనే చేద్దామంటున్నారట. ఇక బడ్జెట్ మితిమీరకుండా హీరో రవితేజ కూడా నిర్మాతలు చెప్పిన కాస్ట్‌ కటింగ్‌ కి ఓకే చెప్పేశాడట. మరి ప్లాప్స్ లో ఉండబట్టే ఇప్పుడు నిర్మాతలు చెప్పినట్టుగా శ్రీను వైట్ల వినాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే ఈయనేం చెబితే నిర్మాతలదే చెయ్యాల్సిన పరిస్థితి ఉండేది. అదే మరి ఓడలు బళ్లవడం.. బళ్ళు ఓడలవడం అంటే..!

Difference Between Hit and Flop:

Srinu Vaitla, Ravi Teja Film Foreign shoot Stopped 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs