Advertisement
Google Ads BL

మెగాడాటర్‌ నిజంగానే జాగ్రత్తపడాలి!


సినిమా ఇండస్ట్రీ అనేది ఓ మాయ. అందులోనూ తారమణుల జీవితాలు గాలిలో దీపం. టాప్‌హీరోయిన్లుగా రాణించిన వారి నుంచి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న వారి వరకు మన దేశంలోని బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌... ఇలా అన్ని భాషల్లోని నటీమణులు ప్రేమ, పెళ్లి విషయంలో తప్పటడుగులు వేశారు. తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. సావిత్రి నుంచి నిన్నమొన్నటి గౌతమి వరకు జెమినిగణేషన్‌ నుంచి కమల్‌హాసన్‌ వంటి వారిచేతిలో మోసపోయి స్వరం పొగొట్టుకున్న వారు ఎందరో. 

Advertisement
CJ Advs

ఇక సినీ నటీమణులు కాకపోయిన సరే మెగా ఫ్యామిలీలో సైతం చిరంజీవి ఇద్దరు కుమార్తెలు సుస్మిత, శ్రీజ వైవాహిక జీవితాలు ఎత్తుపల్లాలతోనే సాగాయి. ఇక విషయానికి వస్తే మెగాడాటర్‌గా ఎంట్రీ ఇచ్చిన నటి, హోస్ట్‌, వెబ్‌సిరీస్‌లు, సినిమాలలో నటిస్తున్న మెగాబ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారిక తాజాగా తన పెళ్లి విషయంలో నోరు విప్పింది. పెళ్లీడు వచ్చిన ప్రతి యువతికి ఉన్నట్లే తనకు తన పెళ్లి పట్ల అనేక కోరికలు ఉన్నాయని చెప్పింది. ఇంకా ఆమె మాట్లాడుతూ, ప్రతి అమ్మాయికి ఇలాంటి కోరికలు, ఊహలు సహజం. నాకూ అలాగే అనిపిస్తుంది. కొందరి జీవితాలలో జరిగిన తప్పొప్పులను చూసిన తర్వాత వారిలా కాకుండా పద్దతిగా పెండ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నాను. 

ఈమద్యకాలంలో పెదనాన్నకూతురు సుస్మిత వివాహాన్ని ఎంతో ఎంజాయ్‌ చేశాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో జరిగిన మొదటిపెళ్లి వేడుక అదే. సంగీత్‌ నుంచి ప్రతి చోటా ఆ సందర్భంగా అల్లరి చేశాను. ఇక సినిమాల విషయానికి వస్తే పాటకు ముందు వచ్చి, ఆ తర్వాత వెళ్లిపోయే పాత్రలు నాకిష్టం లేదు. ఇలాంటివి ఈమధ్య ఎనిమిది చాన్స్‌లు వచ్చాయి. కానీ వాటికి నో చెప్పాను. అలాగని ఆ కథలు బాగాలేవని కాదు.. నాకు సరిపోయేవి మాత్రం కాదు అని చెప్పుకొచ్చింది. ఇక నిహారికకు మెగాస్టార్‌ చిరంజీవి కూతుర్ల వివాహాలే కాదు బాబాయ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ జీవితం కూడా ఓ గుణపాఠం అవుతుందని, అలాంటి తప్పులను నిహారిక రిపీట్‌ చేయకూడదని భావిద్దాం. 

Niharika Reaction on Marriage:

Mega Daughter Niharika Talks About Marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs