Advertisement
Google Ads BL

రాజమౌళి ఛాన్స్ ఇస్తానంటే ఎవరైనా వద్దంటారా!


రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్ లో కేవలం హీరోలు మాత్రం సెట్ అయ్యారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలతో రాజమౌళి 350 కోట్ల భారీ బడ్జెట్ తో డి వి వి దానయ్య ప్రొడ్యూసర్ గా ఒక బడా మల్టీస్టారర్ ని అక్టోబర్ నుండి స్టార్ట్ చెయ్యబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్న రాజమౌళి ఆ స్టార్ హీరోల కోసం హీరోయిన్స్ వేటలో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే మహానటి తర్వాత కీర్తి సురేష్ ని, ప్రస్తుతం టాప్ లో ఉన్న పూజా హెగ్డే లని రాజమౌళి తన హీరోల కోసం సెలెక్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుండగా... నిన్నటికి నిన్న ఈ హీరోయిన్ రేస్ లోకి తాజాగా సమంత వచ్చి చేరింది. పెళ్లయ్యాక బీభత్సమైన ఫామ్ లో గ్లామర్ గర్ల్ గా దూసుకుపోతున్న సమంత ని రాజమౌళి సంప్రదించినట్లుగా వార్తలొచ్చాయి.

Advertisement
CJ Advs

అయితే రాజమౌళి ఆఫర్ ని సమంత సున్నితంగా తిరస్కరించినట్లుగా.. అలాగే రాజమౌళి ఆఫర్ కి సమంత నో చెప్పిందని ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా సమంత మాత్రం అలాంటిదేం లేదని అసలు రాజమౌళి తనని తన మల్టీస్టారర్ కోసం సంప్రదించలేదని... అసలు రాజమౌళి సినిమా అవకాశం వస్తే ఎవరైనా నో చెబుతారండి అని తనపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. మరి గతంలోనే రాజమౌళితో సమంత ఈగ సినిమాలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈగ సినిమాలో సమంతని హైలెట్ చేస్తూ నాని, సుదీప్ ని ఈ సినిమాలో కీలకపాత్రల్లో రాజమౌళి ఫుల్లీ గ్రాఫిక్స్ తో చెయ్యగా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. 

ఇక తర్వాత సమంతకి మళ్ళీ రాజమౌళి సినిమాలో చేసే ఛాన్స్ రాలేదు. కానీ ఇన్నాళ్లకు ఈ మల్టీస్టారర్ కోసం మళ్ళీ సమంత పేరు వినబడింది. మరి రాజమౌళి మల్టీస్టారర్ ని ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి ఎనౌన్స్ చేసినప్పటి నుండి ఆ సినిమాలో హీరోయిన్స్ గా రకుల్ ప్రీత్ అని ఒకసారి, రాశి ఖన్నా అని మరోసారి, కాదు కీర్తి సురేష్, పూజా హెగ్డేలని ఒకసారి ప్రచారం జరుగుతుండగా.. ఆ లిస్ట్ లో ఇప్పుడు సమంత వచ్చి చేరింది. మరి ఫైనల్ గా ఆ స్టార్ హీరోల కోసం ఏ హీరోయిన్స్ దిగుతారో?

Samantha Reacted on Rajamouli MultiStarrer Movie Chance:

I am not in Rajamouli Multistarrer Film Says Samantha.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs