Advertisement
Google Ads BL

క్రిష్ కి పెద్ద చిక్కొచ్చిపడింది..!


చారిత్రాత్మక చిత్రాల దర్శకుడిగా క్రిష్ కి మంచి పేరుంది. గతంలో బాలకృష్ణతో 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాని తెరకెక్కించి హిట్ కొట్టిన దర్శకుడు క్రిష్ బాలీవుడ్ లో ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్రపై 'మణికర్ణిక' సినిమాని కంగనా హీరోయిన్ గా చేశాడు. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బాగా బిజీగా వుంది. తాజాగా క్రిష్ మరో చారిత్రాత్మక బయోపిక్ కి శ్రీకారం చుట్టాడు. నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ ని మొదలు పెట్టడమే కాదు.. శరవేగంగా షూటింగ్ చేస్తున్నాడు. అయితే బాలీవుడ్ లో మణికర్ణిక సినిమాని క్రిష్ ఈ ఆగష్టు 15 కి విడుదల చెయ్యాల్సి ఉండగా.. పలు కారణాలతో ఆ సినిమా జనవరి 25 న రిపబ్లిక్ డే కి పోస్ట్ పోన్ అయ్యింది.

Advertisement
CJ Advs

మరి తెలుగులో క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఈ ఐదు నెలల గ్యాప్ లో షూటింగ్ తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ ని కంప్లీట్ చేసుకుని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల తేదీ ఖరారు చేసుకుంటుంది. ఇంకా నటీనటులను ఫైనల్ గా ఎంపిక చెయ్యని క్రిష్ ఈ ఐదు నెలల కాలంలో ఎన్టీఆర్ బయోపిక్ ని పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ గా తీర్చి దిద్దాలి. ఎలాగూ క్రిష్ పూర్తి స్క్రిప్ట్ తో సినిమా సెట్స్ మీద కెళతాడు కాబట్టి.. క్రిష్ నిజాయితీని శంకించలేము. ఇక బాలకృష్ణ కూడా క్రిష్ కి ఎలా కావాలో అలా సహకరించే వ్యక్తి. అందుకే క్రిష్ ధైర్యంగా ఎన్టీఆర్ బయోపిక్ ని మొదలు పెట్టేశాడు.

అయితే అలాంటి డైరెక్టర్ సినిమాలు రెండు ఒకే నెలలో కొద్దీ రోజుల గ్యాప్ తో విడుదల కాబోతున్నాయన్నది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. క్రిష్ బాలీవుడ్ లో ప్రతిష్ట్మాకంగా తెరకెక్కించిన మణికర్ణికతో పాటుగా.. టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయోపిక్ రెండు సినిమాలు జనవరి నెల 2019 లోనే విడుదల కాబోతున్నాయి. మరి టాప్ డైరెక్టర్ రెండు సినిమాలు ఒకే నెలలో విడుదలవడం ఒక రేర్ రికార్డే. ఎన్టీఆర్ బయోపిక్ సంక్రాంతి కానుకగా విడుదలవుతుండగా.. కంగనా మణికర్ణిక జనవరి 25  న విడుదలవుతుంది. ఇక ఇక్కడ మరో విషయం గమనించాలి. కంగన మణికర్ణికతో తన మాజీ బాయ్ ఫ్రెండ్ అయిన హ్రితిక్ రోషన్  తో జనవరి 25 న బాక్సాఫీసు ఫైట్ కి సిద్దమవుతుంది. 

Manikarnika, NTR Release Dates Clash:

<h1>Balakrishna Vs Krish: Big Clash</h1>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs