Advertisement
Google Ads BL

ఈసారి సర్క్యూట్ కూడా 'సంజు' నే..!!


రాజ్‌కుమార్‌ హిరాణి. ఈయన సంజయ్‌దత్‌ని మున్నాభాయ్‌గా, అర్షద్‌వార్షీని సర్క్యూట్ గా పెట్టి 'మున్నాభాయ్‌ ఎంబిబిఎస్‌, లగేరహో మున్నాభాయ్‌' చిత్రాలను తీసి రికార్డులను క్రియేట్‌ చేశాడు. ఇక ఇవే చిత్రాలు తెలుగులో మెగాస్టార్‌తో 'శంకర్‌దాదా' సిరీస్‌గా, తమిళంలో కమల్‌హాసన్‌ 'వసూల్‌రాజా'గా రీమేక్‌ చేశారు. ఇక సంజయ్‌దత్‌తో రాజ్‌కుమార్‌ హిరాణి 'మున్నాభాయ్‌ ఛలో అమెరికా' స్టోరీని కూడా రెడీ చేసుకుని ఈ సిరీస్‌లో మూడో భాగానికి శ్రీకారం చుట్టాలని భావించాడు. అంతలోనే సంజయ్‌దత్‌ అక్రమాయుధాల కేసులో అరెస్ట్‌ అయి జైలు జీవితం గడపాల్సి రావడంతో ఈ ప్రాజెక్ట్‌ 2016కి వాయిదా పడింది. 

Advertisement
CJ Advs

ఇక 'మున్నాభాయ్‌ చలే అమెరికా'టీజర్‌ని కూడా రాజ్‌కుమార్‌ హిరాణి, విదు వినోద్‌ చోప్రాలు నాడే విడుదల చేశారు. కానీ అంతలో రాజ్‌కుమార్‌హిరాణి 'సంజు' చిత్రంపై ఆసక్తి చూపడంతో మున్నాభాయ్‌ సిరీస్‌ వాయిదాపడింది. ఇక 'సంజు' చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇండియాలో ఈ చిత్రం 300కోట్లు, ఓవర్‌సీస్‌లో 200కోట్లు వసూలు చేసి 500కోట్ల క్లబ్‌లో స్థానం సాధించింది. కాగా ఇప్పుడు మున్నాభాయ్‌ మూడో సీక్వెల్‌ విషయంలో హిరాణికి సరికొత్త ఆలోచన వచ్చిందట. 

'సంజు'లో రణబీర్‌పూర్‌.. సంజయ్‌దత్‌గా నటించి సామాన్య ప్రేక్షకులనే కాదు... రాజ్‌కుమార్‌ హిరాణిని కూడా ముగ్దుడుని చేశాడు. సో.. సంజయదత్‌తో ఆయన తీయాలని భావిస్తున్న 'మున్నాభాయ్‌ ఛలే అమెరికా' చిత్రంలో సంజయ్‌దత్‌ పాత్రను ఆయనే చేయనుండగా, సర్క్యూట్‌గా.. అదేనండీ తెలుగు శంకర్‌దాదాలో ఏటిఎంగా శ్రీకాంత్‌ పాత్రను పోషించిన అర్షద్‌ వార్షి పాత్రలోకి రణబీర్‌కపూర్‌ని తీసుకోవాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. మరి ఇదే నిజమైతే ఒకేసారి సంజయ్‌తో పాటు సంజు పాత్రను చేసిన రణబీర్‌కపూర్‌ కూడా వెండితెరపై సందడి చేయడం గ్యారంటీ అనే చెప్పాలి.

Ranbir Kapoor To Play Circuit In Munna Bhai 3:

Ranbir Kapoor to replace Arshad Warsi as Circuit in Sanjay Dutt Munna Bhai 3
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs