Advertisement
Google Ads BL

'మిస్టర్‌పర్‌ఫెక్ట్‌' అల్లుడు కావాలని మాకూ వుంది!


కొందరు చేసే పనుల ప్రభావం మరికొందరిపై పడుతుంది. ఉదాహరణకు అనుష్కశర్మ, విరాట్‌కోహ్లిల ఎఫైర్‌, ప్రేమ, పెళ్లి వంటి విషయాలలో అన్నీ ముందుగా మీడియాకే లీక్‌ అయినా కూడా చివరి వరకు వారు తమ పెళ్లి వార్తలను ఖండిస్తూ వచ్చారు. చివరకు ఇటలీలో వారి పెళ్లి ఫలానా తేదీన జరగనుందని మీడియా చెప్పినా కూడా వీరిద్దరి పీఏలు వాటిని వదంతులుగా కొట్టిపారేశాడు. చివరకు మీడియా చెప్పినట్లే జరిగింది. ఇక ఇలియానా, శ్రియాశరణ్‌, నయనతార వంటి పలువురి విషయాలలో ఇదే తతంగం నడుస్తోంది. దాంతో ఎవరి మద్య ఎఫైర్‌ ఉందని వార్తలు వచ్చినా, వాటిని ఆయా సెలబ్రిటీలు ఖండించినా కూడా వారిపై పుకార్లు రావడం మాత్రం ఆగడం లేదు. 

Advertisement
CJ Advs

ఇక 'బిల్లా, మిర్చి, బాహుబలి' వంటి చిత్రాలలో తెరపై హిట్‌ పెయిర్‌గా, క్యూట్‌ జంటగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన ప్రభాస్‌-అనుష్కల మద్య కూడా ఎఫైర్‌ ఉందని, వారు త్వరలో వివాహం చేసుకోనున్నారని, అందుకే ప్రభాస్‌, అనుష్కలు ఇంత వయసు వచ్చినా ఇంకా పెళ్లి విషయం ఎత్తడం లేదని టాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఆల్‌రెడీ ఇప్పటికే ఈ విషయాన్ని వారిద్దరు ఖండించారు. అనుష్క అయితే ఇకపై ఇలాంటి వార్తలు రాస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. అయినా వీరిపై పుకార్లు ఆగడం లేదు. 

ఇక ఇటీవల 'సాహో' కోసం రిస్కీ సీన్స్‌లో ప్రభాస్‌ నటిస్తుంటే విషయం తెలుసుకున్న అనుష్క అబుదాబికి వెళ్లి అలా చేయవద్దని, డూప్‌లతో చేయించాలని ఒప్పించి వచ్చింది. ఇక విషయానికి వస్తే మరోసారి ప్రభాస్‌, అనుష్కల వివాహం మరలా తెరపైకి వచ్చింది. దీనిపై అనుష్క తల్లి స్పందిస్తూ, వారిద్దరు స్టార్స్‌, వారు పలు సూపర్‌హిట్‌ చిత్రాలలో నటించారు. అనుష్క కోసం ప్రభాస్‌ వంటి మిస్టర్‌పర్‌ఫెక్ట్‌ కావాలని మాకు కూడా ఉంది. కానీ వారిద్దరు కేవలం తాము మంచి స్నేహితులం మాత్రమే అని ఖచ్చితంగా చెబుతున్నారు... అని వ్యాఖ్యానించింది. ఇలా స్వీటీ తల్లి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చిన తర్వాత అయినా ఈ వార్తలకు చెక్‌పడుతుందో లేదో వేచిచూడాల్సివుంది.

Anushka’s Mother Reacts On Rumors Of Marriage With Prabhas:

<h1><span style="font-weight: normal;">Mom On Anushka-Prabhas Marriage</span></h1>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs