Advertisement
Google Ads BL

పవన్, రవితేజ.. పాపం డైరెక్టర్..!!


ఏడాది నుండి వార్తల్లో ఉన్న రవితేజ - సంతోష్ శ్రీనివాస్ మూవీకి తెర పడినట్టు తెలుస్తుంది. తమిళంలో స్టార్ హీరో విజయ్ నటించిన 'తెరి' సినిమాను తెలుగులో రవితేజతో తీయాలనుకున్నారు మైత్రి మూవీ మేకర్స్ వారు. కానీ కొన్ని కారణాలు వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లట్లేదు అని అర్ధం అవుతుంది. వాస్తవానికి 'తెరి' సినిమాను రెండేళ్ల కిందటే తెలుగులో 'పోలీస్' అనే పేరుతో రిలీజ్ చేశారు. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. 

Advertisement
CJ Advs

అయినా కానీ మళ్లీ ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేద్దాం అనుకున్నారు మైత్రీ సంస్థ. ముందుగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా అనుకుని ఆయనకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఏ విషయమో చెప్పకుండా పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుని రెడీగా ఉన్న టైంలో పవన్ రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో ఆ కథను రవితేజకు చెప్పారు. రవితేజ ఓకే అని కొన్ని మార్పులు చెప్పగా అవి రెడీ చేసి ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం వారి బ్యానర్ లో రవితేజ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా తర్వాత ఈ సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ సినిమాకు బ్రేక్ పడిందని.. దీన్ని మైత్రీ వాళ్లు డ్రాప్ చేశారని అంటున్నారు.

వాళ్ల బ్యానర్ వరసగా ‘శ్రీమంతుడు’.. ‘జనతా గ్యారేజ్’.. ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్స్ సినిమాలు తీసి ఇప్పుడు రొటీన్ కథతో ‘తెరి’ రీమేక్  చేయడం అవసరమా అన్న ప్రశ్నలు ముందు నుంచే ఉన్నాయి. పైగా తెలుగులో ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాను రీమేక్ చేయడమేంటని కూడా అన్నారు. అటు రవితేజ కూడా శ్రీను వైట్ల సినిమా పూర్తి అయిన తర్వాత దాని రిజల్ట్ బట్టి దీని గురించి ఆలోచిద్దాం అనడంతో ఈ చిత్రాన్ని ఆపేసినట్లు తెలుస్తోంది. ఆపేసి ముందుగానే జాగ్రత్త పడ్డారు అనుకుంటే.. పాపం డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ మాత్రం అన్యాయం అయిపోతాడు. ఎందుకంటే అయన ఈ కథ కోసం దాదాపు రెండేళ్లకు పైగా సమయం వృథా చేశాడు.

Raviteja’s Film Shelved Completely:

Mythri Movie Makers Stopped Theri Remake
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs