మూడు నాలుగేళ్లు ప్రాణస్నేహితుల్లా, లవర్స్‌గా మెలిగి ఆ తర్వాత బ్రేకప్ అయిన తర్వాత ఎవరైనా మాజీ ప్రియుడు, లేదా ప్రియురాలు ప్రస్తావన తెస్తే ఒంటికాలిపై మండిపడటం మామూలే. అదే పనిని బాలీవుడ్ నటి, మోడల్ నోరా ఫతేహి కూడా చేసింది. ఈమె బాలీవుడ్ నటుడు అంగద్‌బేడీతో మూడేళ్లకు పైగా ఎఫైర్ సాగించింది. అందునా వీరిద్దరి పుట్టినరోజులు ఒకే రోజు కావడంతో నాడు ఆమె తమ ఇద్దరి ఫోటోలను పోస్ట్ చేసి అంగద్‌ని ఉద్దేశించి 'హ్యాపీ బర్త్‌డే అంగద్.. మన ఇద్దరం ఒకే తేదీన పుట్టడం ఎంతో బాగుంది కదా...! నువ్వు అచ్చం నాలాగే ఎందుకు ఉంటావో ఇప్పుడు తెలిసింది బెస్టీ' అంటూ ట్వీట్స్ మీద ట్వీట్స్ చేసింది.
దానికి అంగద్ కూడా 'థాంక్యూ సూపర్‌స్టార్... హ్యాపీ బర్త్‌డే. నీతో ఈరోజును పంచుకోవడం నా అదృష్టం' అని సమాధానాలు ఇచ్చేవాడు. అలాంటి అంగద్ బేడీ.. నోరాతో బ్రేకప్ కావడంతో మరో బాలీవుడ్ నటి నేహాధూపియాను వివాహం చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో పంజాబీ సంప్రదాయంలో ఈ వివాహం జరిగింది.
కాగా ఇటీవల నోరా ఫతేహి జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. దీనిలో విలేకరి.. అంగద్ బేడీకి వివాహం జరిగింది. ఆయన మీ మాజీ స్నేహితుడు కదా...! ఆయనకు వివాహ శుభాకాంక్షలు తెలిపారా? అని ప్రశ్నించారు. దాంతో నోరా ఫతేమి ఒంటి కాలిపై మండిపడింది. అంగద్ బేడీ అసలు ఎవరు? నాకు ఎవరో తెలియదే. అతని పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు. అసలు మీరేం అడుగుతున్నారో నాకర్ధం కావడం లేదు. అతను ఎవరో తెలియనప్పుడు ఆయన పెళ్లి గురించి నేనేం మాట్లాడతాను' అంటూ ఆ యాంకర్ కమ్ జర్నలిస్ట్‌పై మండిపడింది.