Advertisement
Google Ads BL

అలాంటిది ఉంటే నేనే చెప్తా : సింగర్ సునీత!


సింగర్ సునీతకున్న ఫాలోయింగ్ మరే ఇతర లేడి సింగర్ కి లేదంటే నమ్మశక్యం కాదు. ఎందుకంటే ఫ్యాషన్ ఐకాన్ గా... మరో వైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా.. సూపర్ సింగర్ గా సునీతకి ఇండస్ట్రీలో అంత పేరుంది. 40  ఏళ్ళ వయసులోనూ అదరగొట్టే అందం ఆమె సొంతం. అయితే సునీత తన 19 ఏళ్ళ వయసులోనే పెళ్లి చేసుకుని ఒక బాబు, పాప కూడా పట్టిన తర్వాత భర్తతో విభేదాలొచ్చి అతనికి డివోర్స్ ఇచ్చేసి తన పిల్లల్ని తానే పెంచుకుంటుంది. ప్రతి విషయంలోనూ తన పిల్లలకి తాను తోడు నీడై ఇంతవరకు మరో పెళ్లి ఆలోచనే చెయ్యలేదు. అలాగే మధ్యలో సునీత మీద అనేక రూమర్స్ వచ్చినప్పటికీ... సునీత చాలా హుందాగా అన్నిటికి సమాధానాలిచ్చింది.

Advertisement
CJ Advs

అయితే మళ్ళీ ఇన్నాళ్లకు సునీత రెండో పెళ్లి చేసుకోబోతోందని... సునీత తన అపార్ట్మెంట్ లో ఉండే ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని ఇష్టపడుతోందనీ... ఇక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా తన భార్య నుండి విడాకులు తీసుకున్న వ్యక్తే కావడంతో త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచనలో సునీత ఉన్నట్లుగా కొన్ని వెబ్సైట్ లో నిన్నటినుండి న్యూస్ తెగ స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఇక ఎలాగూ 40 ఏళ్ళ వయసులో పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ పెళ్లి చేసుకుంటుంది.. ఇక సునీత చేసుకుంటే తప్పేం ఉంది అంటూ కొందరు సునీతకి మద్దతు పలుకుతున్నారు.

అయితే ఈ రెండో పెళ్లి వార్తలు ఆఖరుకి సునీత దగ్గరికి వెళ్లడంతో.. ఆమె కాస్త ఆగ్రహానికి గురై... అసలు ఇతరుల పర్సనల్ లైఫ్ గురించిన అంత ఇంట్రెస్టు మీకెందుకుంటుంది. పక్కనివాళ్ళ వ్యక్తిగత విషయాలలో మీకెందుకంత ఆసక్తి అంటూ సోషల్ మీడియా ద్వారా నవ్వుకుంటూనే అంటించాల్సింది అంటించింది. మరి సునీత చెప్పింది ఒక విధముగా కరెక్ట్. ఆమె పర్సనల్ లైఫ్ ఆమెది. కానీ సెలెబ్రిటీ అన్నాక ఇలాంటి గాసిప్స్ రావడం కూడా సహజమే.

Singer Sunitha Clarity on Marriage Rumours:

Singer Sunitha Condemned Second Marriage 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs