ఈమద్య సరైన కంటెంట్‌తో కాస్త బోల్డ్‌గా యూత్‌కి కనెక్ట్ అయ్యేలా తీసిన చిత్రాలు లోబడ్జెట్ చిత్రాలైనా సరే ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ఇప్పటికే 'అర్జున్‌రెడ్డి'తో సంచలనం క్రియేట్ చేసిన దర్శకుడిగా సందీప్‌రెడ్డి వంగా పేరుతెచ్చుకున్నాడు. ఈయనకు 'అర్జున్‌రెడ్డి' చిత్రాన్నే బాలీవుడ్‌లో కూడా రీమేక్ చేసే అవకాశంతో పాటు సూపర్‌స్టార్ మహేష్‌బాబును కూడా తన కథతో మెప్పించాడని సమాచారం. ఇప్పుడు అదే కోవలోకి 'ఆర్‌ఎక్స్100' చిత్రం వచ్చి చేరింది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్స్, టీజర్, ట్రైలర్ నుంచే యూత్‌ని బాగా ఆకట్టుకుంటూ వచ్చింది. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా కలిసి నటించిన ఈ చిత్రం యూత్‌ని టార్గెట్ చేస్తూ అతి చిన్న చిత్రంగా విడుదలై వారం తిరగముందే పది కోట్లు వసూలు చేసింది. ఇందులోని హీరో క్యారెక్టర్‌తో యూత్‌లోని ప్రతి ఒక్కరు తమను తాము ఐడెంటిఫై చేసుకుంటూ ఉన్నారు.
ఇక ఈ చిత్రానికి రాంగోపాల్‌వర్మ శిష్యుడు అజయ్‌భూపతి దర్శకత్వం వహించాడు. తన కెరీర్‌నే 'శివ' వంటి సంచలనంతో ప్రారంభించిన వర్మ పెద్ద పెద్ద సీనియర్ దర్శకుల కంటే అతి తక్కువ వ్యవధిలో ఎందరో దర్శక శిష్యులకు లైఫ్ ఇచ్చాడు. కృష్ణవంశీ, గుణశేఖర్, పూరీ జగన్నాథ్ వంటి వారందరూ ఆయన శిష్యులే. కానీ ఈమద్యకాలంలో ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా సరిగా రాణించలేకపోతున్నారు. కానీ ఆ లోటును అజయ్‌భూపతి భర్తీ చేశాడు.
ఇక ఈయనకు భవ్యక్రియేషన్స్ బేనర్‌లో గోపీచంద్ హీరోగా ఓ మూవీ, నితిన్ హీరోగా ఆయన తండ్రి సుధాకర్‌రెడ్డితో ఓ మూవీ, స్రవంతి రవికిషోర్ నిర్మాతగా రామ్ హీరోగా ఓ మూవీ..వంటి అవకాశాలతో పాటు వరుసగా మూడు చిత్రాలను తన బేనర్‌లో చేయాలని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్‌బాబు నుంచి కూడా ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తుంది. చివరకు అజయ్‌భూపతి నితిన్‌తో ఆయన తండ్రి సుదాకర్‌రెడ్డి నిర్మాతగా ఓ చిత్రం చేయాడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ 'శ్రీనివాస కళ్యాణం' చిత్రంలో నటిస్తున్నాడు. దీని తర్వాత 'ఛలో' దర్శకుడు వెంకీ కుడుములతో ఓ సినిమా చేస్తాడు. ఆ లోపు నితిన్ సబ్జెక్ట్‌ని అజయ్‌భూపతి పూర్తి చేస్తాడని, వెంకీ కుడుముల తర్వాత నితిన్ చిత్రం అజయ్‌భూపతితోనే అని తెలుస్తోంది.