Advertisement
Google Ads BL

హెబ్బా కాదు.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చేది యాంకర్!


బిగ్ బాస్ సీజన్ 2 వ్యాఖ్యానంని హీరో నాని ఎలా చేస్తాడో? ఎలా షో ని నెట్టుకొస్తాడో అన్న అనుమానాలు ఉన్నప్పటికీ.. షో స్టార్ట్ చేసిన రెండు మూడు వారాలు తర్వాత ఆ అనుమానాలు అన్ని పటాపంచలైపోయాయి. నాని చెప్పే పిట్ట కథలతో.. ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. అలాగే షో లోని కంటెస్టెంట్స్ చేసే తప్పులను ఎత్తి చూపుతూ వారు రియలైజ్ అయ్యేలా కోప్పడుతున్నాడు కూడా. వీక్ డేస్ లో కాస్త చప్పగా సాగుతున్న ఈ షోకి  వైల్డ్ కార్డు ఎంట్రీ తో రెండో వారంలోనే హీరోయిన్ నందిని బిగ్ బాస్ హౌస్ కి పంపారు. అయితే ఆమె ఎవరికి తెలియకపోవడం వలన అది కూడా వర్క్ అవుట్ కాలేదు. ఇక ఆమె ఈ షో కి ఏ విధంగానూ ప్లస్ కాలేదు. ఈలోపు కుమారి 21 ఎఫ్ హీరోయిన్ హెబ్బా పటేల్ షోలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ అని ప్రచారం జరిగినా... దానిని హెబ్బా పటేల్ ఖండించేసింది.

Advertisement
CJ Advs

మరి బిగ్ బాస్ షో కి అదనపు హంగుల కోసం స్టార్ మా ఒక ఎత్తుగడ వేసింది. మేల్ యాంకర్ గా టాలీవుడ్ లో దూసుకుపోతున్న ప్రదీప్ మాచిరాజుని ఈ బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు ద్వారా పంపారు. ఎన్నో ఆడియో ఫంక్షన్స్ లో.. ఎన్నో టీవీ షోస్ తో తనదైన శైలితో.. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని అలరించిన ప్రదీప్ ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. ఢీ 10 లో కామెడీతో అందరిని ఎంటర్టైన్ చేసిన ఈ ప్రదీప్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి నవ్వులు పూయిస్తాడో చూడాలి. తన కామెడీ టైమింగ్  తో మేల్ యాంకర్ గా అస్సలు గ్యాప్ లేకుండా దూసుకుపోతున్న ప్రదీప్ ఇప్పుడు ఢీ 10 గ్రాండ్ ఫినాలేని ఎంతో సక్సెస్ ఫుల్ గా నడిపించిన ప్రదీప్ ఇక బిగ్ బాస్ హౌస్ లో మిగతా 10 వారాలు తన కామెడీ అండ్ బిగ్ గేమ్ తో ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి.

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎవరు వస్తారో అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు స్టార్ మా యాజమాన్యం.. ప్రదీప్ మాచిరాజు ని బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయాన్ని ఓ ప్రోమోని ద్వారా బయటికి వదిలారు. దాంతో ఇంకా బిగ్ బాస్ లోకి  ఇక ఎంటర్టైన్మెంట్ పక్కా అని అందరు అభిప్రాయపడుతున్నారు. మొన్నటి వరకు చప్పగా సాగిన బిగ్ బాస్ ఈరోజు నుండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగనుంది. ఇక పలు ఛానల్స్ లో తన యాంకరింగ్ ద్వారా ఎంటర్టైన్మెంట్ చేసిన ప్రదీప్.. కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళగానే అక్కడివారందరిని తన మాటల్తో ఆకట్టేసుకుంటున్నాడు. అలాగే తన కామెడీతో అప్పుడే షోలో నవ్వులు పూయించేస్తున్నాడు. మరి ప్రోమోలో చూపిన విధముగా ఈ రోజు అంటే గురువారం ప్రదీప్ బిగ్ హౌస్ లోకి ఎంటర్ అవుతున్నాడు.

Here is The Latest Update of Bigg Boss Telugu Wild Card Card Entry :

Bigg Boss Telugu Wild Card Card Entry  Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs