Advertisement
Google Ads BL

మెగాస్టార్ కారు.. ఎవరన్నా కొనండర్రా..!


డబ్బున్న వాడికి ప్రతిది ఓ మంచి అలవాటేనన్నట్లుగా ఉంటుంది. వారు ఏమి చేసినా అది ఒక వార్త అవుతుంది. ఇక బిగ్‌బి అమితాబ్‌ విషయానికి వస్తే ఈయనకు కార్ల పిచ్చి ఎక్కువ. మార్కెట్‌లోకి ఏ కొత్త కారు వచ్చినా వెంటనే అది ఆయన ఇంటి ఆవరణలో ప్రత్యక్షమైపోతుంది. ఇలా ఆయన ఇంట్లో ఒక కారు షోరూంని మించిన కార్లు ఉంటాయనేది అందరికీ తెలిసిందే. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే గతంలో అమితాబ్‌ మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన రేంజ్‌ రోవర్‌ సంస్థకు చెందిన లగ్జరీ ఎస్యూవీ కారును కొంత కాలం వాడాడు. ఆ కారు మార్కెట్‌లోకి వచ్చిన కొత్తల్లో ఇది జరిగింది. కానీ దానిపై మోజు తీరగానే తన ఇంటి ఆవరణలో కూడా కార్లు నిండిపోవడంతో ఆయన సెకండ్‌ సేల్‌కి దానిని మార్కెట్‌లో ఉంచాడు. ఇది సెకండ్‌ హ్యాండ్‌ కార్‌ మార్కెట్లో దుమ్ముకొట్టుకుపోతోంది. ఈ సెకండ్‌హ్యాండ్‌ కారుని కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. గతంలో ఈ కారుని అమితాబ్‌ నుంచి కొన్న వ్యక్తి దానిని అమ్ముతున్నట్లు ఆన్‌లైన్‌లో ప్రకటన చేశాడు. కండీషన్‌లో ఉన్న ఈ కారు ధరను ఆయన 24లక్షల రూపాయలుగా నిర్ణయించాడు. 

ఈ కారు ప్రస్తుతం ముంబైలోని యూజ్‌డ్‌ మార్కెట్‌లో పడి ఉంది. ఈ కారు పెట్రోల్‌తో నడిచేది కావడంతో ఎవ్వరూ దీనిని కొనడానికి ముందుకు రావడం లేదని, మెయిన్‌టైనెన్స్‌ ఖర్చు ఎక్కువ అవుతుందని భావించడంతో పాటు నిర్వహణ సమస్యతో పాటు దీని స్పేర్‌ మార్కెట్స్‌ ఇండియాలో దొరికే చాన్స్‌లు చాలా తక్కువ కావడంతో ఎవ్వరూ ఈ కారును కొనడానికి ఆసక్తి చూపడం లేదు. మరి ఈ 'చల్తీకా నామ్‌ గాడీ.. చలాకీ వన్నెలేడీ..'ని ఎవరు సొంతం చేసుకుంటారో వేచిచూడాల్సివుంది! 

No Takers For Amitabh Bachchan’s Range Rover Car:

<h1><span style="font-weight: normal;">No takers for Megastar's Car</span></h1>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs