Advertisement
Google Ads BL

చరణ్, ఉపాసనల మరో వీడియో..!


సినిమా వారిని మనం ఎంతో ఎంజాయ్‌ చేస్తుంటారని భావిస్తాం. కానీ సీత కష్టాలు సీతవైతే, పీత కష్టాలు పీతవి అన్నట్లు వారికి కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా బిజీగా ఉండే వారికి తమ ఫ్యామిలీతో కలిసి గంటైనా ప్రశాంతంగా గడిపే ఖాళీ ఉంటుందా? అంటే చెప్పలేం. ఇక విషయానికి వస్తే భర్తల బాధ్యత కేవలం భార్యలను ప్రేమగా చూసుకోవడం, వారి బాధ్యతలను పంచుకోవడమే కాదు.. తమ శ్రీమతుల లక్ష్యాలను, గోల్స్‌ని చేరుకునేలా మోటివేట్‌ చేయడం కూడా అత్యంత ముఖ్యం. 

Advertisement
CJ Advs

ఇక రామ్‌చరణ్‌ విషయానికి వస్తే ఒకపక్క ఆయన బోయపాటి చిత్రం, దాని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో చేయబోయే మల్టీస్టారర్‌ చిత్రం, కథా చర్చలు, మేకోవర్‌, జిమ్‌ వర్కౌట్స్‌ ఇలా నిత్యం బిజీగా ఉంటాడు. అందునా ఆయన ఇటీవల నిర్మాతగా మారి తమ ఇంటి పేరున కొణిదెల బేనర్‌ని కూడా స్థాపించాడు. ఇందులో ఆల్‌రెడీ తన తండ్రి చిరంజీవి నటించిన 150వ చిత్రం 'ఖైదీనెంబర్‌150'తో పాటు చిరు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన 'సై..రా..నరసింహారెడ్డి'ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. దీంతో ఈయన సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండడు.

కానీ ఆయన శ్రీమతి అపోలో వ్యవహారాలు చూసుకుంటూనే తన భర్తకి సంబంధించిన విషయాలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఉపాసన, తన భర్త మిస్టర్‌ సితో కలిసి చేసిన జిమ్‌ వర్కౌట్స్‌, ఎక్స్‌ర్‌సైజ్‌ల వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోని అభిమానులకు షేర్‌ చేసిన ఉపాసన మాట్లాడుతూ, అపోలో స్టూడియోలో వారం రోజుల ట్రాన్స్‌ఫర్మేషన్‌ ప్రోగ్రాం కోసం చరణ్‌ తనని మోటివేట్‌ చేశాడని గర్వంగా చెప్పుకొచ్చింది. 

Click Here for Video

Charan-Upasana Workout Video Sensation in Social Media:

Upasana Shares One More workout video of Charan  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs