Advertisement
Google Ads BL

మెగాస్టార్ ని అలాగేనా పొగిడేది..!


సినిమా వేడుకలు అందునా స్టార్‌ చిత్రాల సినిమాలంటే ఒకరి ఒకరు పొగుడుకుంటూ, తాము తమ భుజాలను తట్టుకోవడమే కాదు.. ఇతరులను ఆకాశానికి ఎత్తిపారేస్తారు. దీనికి సెటైర్‌గానే మహేష్‌బాబు చిత్రంలో ఆయన ఈ భజన కార్యక్రమాలపై సెటైర్‌ విసిరాడు. ఇక అందునా అతను మాలీవుడ్‌ మెగాస్టార్‌ మమ్ముట్టి. దాంతో ఓ దర్శకుడు మమ్ముట్టిని ఎలాగైనా అతిశయోక్తులతో మునగచెట్టు ఎక్కించాలని భావించాడు. కానీ ఆ క్రమంలోనే సరైన మాటలు దొరకక తడబడి ఏదేదో వాగేశాడు. అవే ఇప్పుడు ఆయనపై తీవ్ర విమర్శలకు కారణమవుతున్నాయి. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే మాలీవుడ్‌ మెగాస్టార్‌ మమ్ముట్టి తాజాగా దర్శకుడు మిస్కిన్‌ దర్శకత్వంలో 'పెరాన్బు' అనే చిత్రం తీశాడు. ఈ చిత్రం టీజర్‌ వేడుక తాజాగా జరిగింది. ఈ సందర్భంగా మిస్కిన్‌.. మమ్ముట్టిని ప్రశంసల వర్షంలో ముంచెత్తి తన ప్రత్యేకత చాటుకోవాలని భావించాడు. ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్రంలో మమ్ముట్టి ఎంతో సహజంగా, అద్భుతంగా నటించాడు. ఇదే చిత్రాన్ని వేరే హీరో అయితే ఓవర్‌యాక్షన్‌ చేసి చెడగొట్టేవాడు. కానీ మమ్ముట్టి నటన అద్భుతం. ఈ చిత్రం చూస్తున్న ప్రేక్షకులు ఆయన్ను చూస్తూ ఉండిపోతారు. నేను వయసులో ఉండి, మమ్ముట్టి అమ్మాయిగా పుట్టి ఉంటే నేను మమ్ముట్టిపై రేప్ చేసేవాడిని. నేనేదో అసభ్యంగా మాట్లాడుతున్నానని భావించవద్దు. మమ్ముట్టి గొప్పతనం ఎలాంటిదో చెబుతున్నాను.. అంటూ కామెంట్‌ చేశాడు. 

ఓ అద్భుత నటుడిని ప్రశంసించడం, అందునా భారతదేశం గర్వించదగ్గ మమ్ముట్టిని పొగడటంలో తప్పు లేదు. కానీ ఈ పొగడ్తల క్రమంలో ఆయన చేసిన వర్ణన మీద మాత్రం దుమారం రేగుతోంది. నెటిజన్లు మిస్కిన్‌పై మండిపడుతున్నారు. మమ్ముట్టిని ప్రశసించేందుకు ఇంత కంటే మంచి వర్ణనలు లేవా? అంటూ మిస్కిన్‌పై ధ్వజమెత్తుతున్నారు. 

Director Mysskin Sensational Comments on Mammootty:

I would've raped Mammootty if I were a girl, says director Mysskin
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs