Advertisement
Google Ads BL

ఈ వారం సినిమాల సంగతేంటి..?


మే నెలలో మహానటి సూపర్ హిట్, జూన్ లో అభిమన్యుడు హిట్ అయితే.. సమ్మోహనం పర్వాలేదనిపించింది. అంతకు మించి  ఎన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద సందడి చేసినా ఒక్క సినిమా కూడా నిలబడలేక చేతులెత్తేశాయి. ఇక ఈ నెలలో మొదటి వారంలో విడుదలైన గోపీచంద్ పంతం యావరేజ్ కాగా.. సాయి ధరమ్ తేజ్ తేజ్ ఐ లవ్ యు ప్లాప్. అలాగే గత గురువారం కళ్యాణ్ దేవ్ విజేత ప్లాప్ కాగా...కార్తికేయ RX 100 అనుకోకుండా హిట్ దిశగా దూసుకుపోతుంది. ఇక శుక్రవారం విడుదలైన చినబాబు హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ లేవు. మరి ఈ వారమైన మంచి సినిమాలేమన్న బాక్సాఫీసు బరిలో ఉన్నాయా... అంటే నో అనేమాట వినబడుతుంది.

Advertisement
CJ Advs

రాజ్ తరుణ్ 'లవర్' కి దిల్ రాజు నిర్మాత కాబట్టి.. ఈ సినిమాపైనే కాస్త అంచనాలు వున్నాయి. ఇక మరో సినిమా లక్ష్మి మంచు నటించిన  వైఫ్ ఆఫ్ రామ్ సినిమా లో కూడా విషయం ఏమాత్రం ఉందొ తెలియదు గాని... ఆ సినిమాపై కూడా ఎలాంటి బజ్ లేదు. ప్రమోషన్స్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ... అవేమి వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి.

ఈ వారం ఇంకో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఆ నలుగురు దర్శకుడు చంద్ర సిద్దార్థ తెరకెక్కించిన ఆట గదరా శివ సినిమా కూడా ఉంది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ఈ సినిమా సాంగ్ ని విడుదల చేసినా ఈ సినిమాపై ఎలాంటి హైప్ క్రియేట్ కాలేదు. ఇక నాలుగో సినిమా పరిచయం. సినిమాని బాగా పబ్లిసిటీ చేస్తున్నప్పటికీ... అందరు కొత్తవాళ్ళు కావడంతో ఆ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో విడుదల అయితే కానీ చెప్పలేం. ఇక ఈ నాలుగు సినిమాల్లో ఏదో కాస్త పర్వాలేదనిపించినా ఆ నిర్మాతలు ఒడ్డెక్కేస్తారు. కానీ తేడా వచ్చిందా రోడ్డున పడడం ఖాయం. ఇక ఈ సినిమాల టాక్ బాగోపోతే.. గత వారం వచ్చిన RX 100 మరింత దండుకునే అవకాశం ఉంది.

4 Movies Ready to Release in This Week:

Lover vs Wife of Ram vs Aatagadara Siva vs Parichayam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs