ప్రస్తుతం ఇండస్ట్రీలో బాబయ్ అబ్బాయిలు ఉన్నది మెగా ఫ్యామిలీలోను, నందమూరి ఫ్యామిలీలోను. మెగా ఫ్యామిలీలో స్టార్ హీరోస్ అయిన పవన్ కళ్యాణ్ బాబాయ్ అయితే... రామ్ చరణ్ అబ్బాయ్. ఇక నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ బాబాయ్ అయితే కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు అబ్బాయిలు. అయితే పవన్ కళ్యాణ్ కి రామ్ చరణ్ కి ఉన్నంత రిలేషన్ షిప్.. బాలకృష్ణకి ఎన్టీఆర్ కి లేదు. నందమూరి ఫ్యామిలీలో ఉన్న లుకలుకలు వల్ల బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరు ఏడ మొహం పేడ మొహంగానే ఉంటారు. అయితే తాజాగా బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయ్ ఎన్టీఆర్ లు ఒకే చోట తమ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.
బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ని క్రిష్ డైరెక్షన్ లో మొదలు పెట్టేశాడు. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జోరుగా సాగుతుంది. మొన్న దర్శకుడు క్రిష్ కూడా మర్యాద పూర్వకముగా రామోజీ ఫిలింసిటీ అధినేత రామోజీరావు ని కలిశాడు. ఇక విద్యాబాలన్, బాలకృష్ణలపై రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాలను క్రిష్ చిత్రీకరిస్తున్నారు. అయితే అక్కడే దగ్గరలోనే త్రివిక్రమ్ - ఎన్టీఆర్ లు తమ అరవింద సమేత షూటింగ్ ని కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఫిలింసిటీలో వేసిన కాలేజ్ సెట్ లో త్రివిక్రమ్ ఎన్టీఆర్ - హీరోయిన్ పూజా హెగ్డేల మీద కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో తెరకెక్కుతున్న త్రివిక్రమ్ అండ్ ఎన్టీఆర్ ల సినిమా ఇక్కడ ఫిలింసిటీలో వేసిన కాలేజ్ సెట్ సీన్స్ పూర్తి కాగానే పొల్లాచ్చి బయలు దేరుతుంది. అక్కడ హీరో ఎన్టీఆర్ హీరోయిన్ పూజ హెగ్డే ల మీద పాటలతో పాటుగా మరికొన్ని సీన్స్ ని త్రివిక్రమ్ షూట్ చేస్తాడు. మరి ఇలా ఒకేచోట బాబయ్ బాలకృష్ణ, అబ్బాయ్ ఎన్టీఆర్ లు తమ సినిమాల షూటింగ్స్ తో దున్నేస్తున్నారు.