Advertisement
Google Ads BL

'ఎన్టీఆర్' భార్యగా ఒప్పుకుంది అందుకే: విద్యాబాలన్!


ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో బాలయ్య - క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న 'ఎన్టీఆర్' బయోపిక్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా ఈ షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తుంది. ఆమె లేటెస్ట్ గా ఓ ఇంగ్లీష్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు ఎన్టీఆర్ బయోపిక్ లో ఎందుకు నటిస్తున్నానో వివరణ ఇచ్చింది.

Advertisement
CJ Advs

తనకు ఇప్పటికే ఎన్నో బయోపిక్స్ లో నటించాలని ఆఫర్స్ వచ్చిన అవి ఆమె రిజెక్ట్ చేసిందంట. అయితే తెలుగులో ఎన్టీఆర్ అంటే చాలా ఫేమస్ యాక్టర్. ఆయన భార్య గురించి చాలా తక్కువ మందికి తెలియడం తనకు ఆకట్టుకుందని చెప్పింది. ఎన్టీఆర్ లైఫ్ లో ఆయన భార్యది కీలకమైన పాత్ర. ఆ పాయింట్ నన్ను ఆకట్టుకోవడం..ఆ రోల్‌పై ఆసక్తి కలగడం.. అలా వెంటనే ఓకే చేయడం జరిగిందని వెల్లడించింది ఆమె. అయితే ఈ సినిమాలో విద్యాబాలన్ కేవలం అతిధి పాత్రలో మాత్రమే నటిస్తుందని విషయం మీడియాలో నడుస్తుంది.

మరి ఎన్టీఆర్ భార్య పాత్రలో ఆమె ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అదికాక సోమవారం నటి విద్యాబాలన్ ఎన్టీఆర్ ఫ్యామిలీని కలిసి.. అసలు ఆమె మీతో ఎలా ఉండేవారు..ఎలా మాట్లాడేవారు...అలా ఆమె గురించి అన్ని తెలుసుకుందని ఫిలింనగర్ సమాచారం. ఇక విద్యాబాలన్ అఫీషియల్ గా రేపు అంటే బుధవారం నుంచి రెగ్యులర్ షూట్‌కి హాజరుకానుంది.

Vidya Balan Quashes Rumours on Her Role in NTR:

Vidya Balan's Crucial Role in NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs